తాను లౌకికవ్యక్తినని.. కానీ ప్రస్తుతం బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్ అన్నారు. నవంబర్ 23న గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు. శుక్రవారం (21-11-2025) గవాయ్‌ది చివరి పని దినం.
CJI BR Gavai: మంగళగిరి CK కన్వెన్షన్ లో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరు అయ్యారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మాట్లాడుతూ.. నా స్వస్థలం మహారాష్ట్రలో అమరావతి.. సీజేఐగా నా చివరి కార్యక్రమం ఇక్కడ అమరావతిలో జరుగుతోంది.
CJI BR Gavai: రేపు విజయవాడకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రేపు (నవంబర్ 16న) ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని 'ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్' అనే అంశంపై ప్రసంగించనున్నారు.
BRS vs Speaker: తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో ధిక్కార పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల విషయంలో మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ పూర్తి చేయలేదంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తరపున ఈ పిటిషన్ దాఖలు అయింది.
Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం ఈడీపై విరుచుకుపడింది. మంగళవారం సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పిటిషన్‌ను విచారణకు వచ్చింది. రూ.1,000 కోట్ల కుంభకోణానికి సంబంధించి తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) అధికారుల ప్రాంగణాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడులను సవాలు చేస్తూ.. ఈడీ చర్యలపై స్టే ఇవ్వాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై షూతో దాడికి యత్నించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోమవారం ఉదయం విచారణ జరుగుతున్న సమయంలో ఒక వృద్ధ న్యాయవాది రాకేష్ కిషోర్(71) షూ విసిరేందుకు ప్రయత్నించాడు. దీంతో భద్రతా సిబ్బంది అడ్డుకుని బయటకు తీసుకుని పోయారు.
Telangana Secretariat: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) బిఆర్. గవాయిపై జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ సచివాలయంలో ఆగ్రహావేశం వ్యక్తమైంది. బీఆర్. అంబేద్కర్ తెలంగాణ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగులు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని “జస్టిస్ గవాయి జిందాబాద్”, “దళితులపై దాడులు ఆపాలి”, “న్యాయవ్యవస్థ గౌరవాన్ని కాపాడాలి” అంటూ నినాదాలు చేశారు. సి.జె.ఐ. బిఆర్. గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం,…
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై షూతో దాడికి యత్నించిన ఘటనను ప్రధాని మోడీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సహా అన్ని రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. కానీ కర్ణాటకకు చెందిన ఒక బీజేపీ నేత, మాజీ ఐపీఎస్ అధికారి భాస్కర్ రావు మాత్రం.. దాడికి యత్నించిన న్యాయవాది ధైర్యాన్ని ప్రశంసించారు. న్యాయవాది ధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందేనని వ్యాఖ్యానించారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానంలో సోమవారం అమానుష ఘటన చోటుచేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై ఓ వృద్ధ న్యాయవాది రాకేశ్ కిషోర్(71) ఊహించని రీతిలో షూ విసిరేందుకు ప్రయత్నించాడు.
సుప్రీం ధర్మాసనం..‘‘ఇది పూర్తిగా ప్రచార ప్రయోజన వ్యాజ్యం. వెళ్లి దేవుడినే ఏదైనా చేసుకోమని అడగండి. మీరు విష్ణువు భక్తులని మీరు అనుకుంటే, మీరు ప్రార్థన చేసి, కొంత ధ్యానం చేయండి’’ అని సీజేఐ అన్నారు. ఈ ఆలయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికార పరిధి కిందకు వస్తుందని పేర్కొంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది.