జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలకు మరో విజయం లభించింది. వరసగా జరుగుతున్న ఎన్ కౌంటర్లలో ముష్కరులను మట్టుబెడుతున్నారు. గత మూడు రోజుల నుంచి వరసగా ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి. తాజాగా శనివారం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులను హతం చేశారు. దక్షిణ కాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా బజ్ బెహరా వద్ద ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో సీఆర్ఫీఎస్, కాశ్మర్ పోలీసులు గాలింపులు జరుపుతున్న…