China delayed sanction on top terrorist: ఇండియా అంటే నిలువెల్లా వ్యతిరేకత ప్రదర్శించే చైనా మరోసారి అలాంటి పనే చేసింది. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత సభ్యదేశం కోసం వీటో అధికారం ఉన్న రష్యా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఒప్పుకుంటుంటే.. చైనా మాత్రం ఎప్పటికప్పుడు భారత్ సభ్యత్వాన్ని సాకులు చూపెడుతూ అడ్డుకుంటూ వస్తోంది. యూఎన్ లో భారత్ ఏ తీర్మాణం ప్రవేశపెట్టిన వ్యతిరేకించడమే పనిగా పెట్టుకుంటోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదంపై భారత్ పలుమార్లు యూఎన్ లో ప్రతిపాదనలు పెడితే పాకిస్తాన్ కు అండగా నిలిచింది చైనా.
తాజాగా పాకిస్తాన్ కు చెందిన జైష్-ఎ-మహ్మద్ (జెఇఎమ్) ఉగ్రవాద సంస్థ ఉగ్రవాదిపై ఆంక్షలు విధించాలని భారత్, అమెరికా ప్రతిపాదిస్తే.. ఈ ప్రతిపాదనపై జాప్యం చేస్తోంది చైనా. యూఎస్ఏ, ఇండియా కలిసి జైష్ ఉగ్రవాది అబ్దుల్ రౌఫ్ అజార్ పై ఆంక్షలు పెట్టాలని ప్రతిపాదించాయి. అజార్ ఆస్తులను స్తంభింపచేయడంతో పాటు.. నిషేధం విధించాలని భారత్, ఐరాసలో ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను భద్రతా మండలిలోని 15 మంది సభ్యులు అంగీకరించాలి.
Read Also: Norway Jail: ఇది జైలు కాదు స్వర్గం.. అంతకు మించి!
అయితే భారత్ ప్రతిపాదనను మేం అధ్యయనం చేస్తున్నామని.. మాకు మరికొంత సమయం కావాలని హెల్డ్ లో ఉంచామని.. చైనా ప్రతినిధి వెల్లడించారు. 2010లో యూఎస్ ట్రెజరీ అజర్ పాకిస్తాన్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. భారత్ లో ఉగ్రదాడులు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. అయితే ఈ ప్రతిపాదనపై యూఎస్ఏ స్పందించింది. అమెరికా ఇతర సభ్యదేశాలను గౌరవిస్తుందని.. ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడకుండా, ఇతర దేశాలను ఉపయోగించుకోకుండా నిరోధించేందుకు అమెరికా భద్రతా మండలిలో ఇతర దేశాల సహకారాన్ని కోరుకుంటుందని ఆ దేశ ప్రతినిధి వెల్లడించారు.