India-US Tariffs: భారత్ సహా కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార పన్నులు విధించడానికి అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. దీనిపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపు (ఏప్రిల్ 2న) తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి మినహాయింపులు లేవని ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. తాజాగా దీనిపై వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తుందన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాలతో యూఎస్ ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారిందన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలు విధించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించింది.
Read Also: IPL 2025: రూ.23.75 కోట్లు అవసరమా?.. వెంకటేశ్‌ను ఆటాడుకుంటున్న ఫాన్స్!
ఇక, అమెరికాపై అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాను కరోలిన్ మీడియాకు చూపించింది. దురదృష్టవశాత్తూ కొన్ని దేశాలు చాలా కాలంగా మమ్మల్ని పన్నుల రూపంలో పీల్చుకు తింటున్నాయన్నారు. యూఎస్ డెయిరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50 శాతం సుంకాలు వసూలు విధిస్తుండగా.. మా బియ్యంపై జపాన్ 700 శాతం, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100 శాతం, మా బటర్, చీజ్‌పై కెనడా 300 శాతం టారిఫ్ వసూలు చేస్తున్నాయని ఆమె ఆరోపించింది. వీటి వల్ల మా ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యమైందన్నారు. అధిక సుంకాలతో అమెరికన్ల వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తింటున్నాయి.. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు వేసేందుకు ఇదే కరెక్ట్ సమయమని భావిస్తున్నట్లు వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ చెప్పుకొచ్చింది.