Jason Miller: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతదేశంపై 50 శాతం సుంకాలు విధించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఒత్తిడికి లోనయ్యాయి. అయితే, తాజా భారత లాబీయిస్ట్ జాసన్ మిల్లర్ రంగంలోకి దిగారు. ఆయన ట్రంప్, ఆయన అడ్మినిస్ట్రేషన్‌లోని కీలక వ్యక్తులను కలిశారు.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇష్టానురీతిలో పలు దేశాలపై సుంకాలు విధించడాన్ని ఇటీవల అమెరకన్ ఫెడరల్ అప్పీల్ కోర్టు తప్పు పట్టింది. అయితే, ఈ తీర్పును ట్రంప్ సర్కార్ సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతోంది. కోర్టులో పిటిషన్ వేసిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్, ఈ సుంకాలను ఉక్రెయిన్ యుద్ధంలో భారత్‌ని లింక్ చేసింది. ‘‘ఉక్రెయిన్‌లో శాంతి కోసం మా ప్రయత్నంలో కీలకమైన అంశం’’ అని సుంకాలను సమర్థిస్తూ వాదించింది.
Piyush Goyal: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణం చూపి అగ్రరాజ్యం అమెరికా భారత్‌పై 50% సుంకాలను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 27 నుంచి ఈ సుంకాలు అమలు అవుతున్నాయి. ఈక్రమంలో అమెరికా భారత్‌పై 50 శాతం సుంకాన్ని విధించడంపై దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. తాజాగా కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్ అమెరికా ప్రతీకార సుంకాలపై కీలక ప్రకటన విడుదల చేశారు. ఇండియా అమెరికన్ సుంకాలకు తలవంచబోదని…
India-US Tariffs: అమెరికా విధించిన 25% సుంకాలపై పార్లమెంటులో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ భారత్ తదుపరి చర్యలను వివరించారు. భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని, రాబోయే కాలంలో అభివృద్ధి చెందిన దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ప్రారంభిస్తుందని గోయల్ సూచించారు. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ చేసిన వాదనలను ఖండించారు.
వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. అమెరికా ఉత్పత్తులపై భారత్ 100 శాతం సుంకాలు విధిస్తుందన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాలతో యూఎస్ ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారిందన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలు విధించడానికి ఇదే సరైన సమయమని వెల్లడించింది.