డిపెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 2025లో నిరాశపరుస్తోంది. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఓ దాంట్లో గెలిచి, రెండింటిలో ఓడింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడిన కేకేఆర్.. రెండో మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలిచింది. ఇక సోమవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 116 పరుగులకే ఆలౌట్ అయి.. 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కొత్త కెప్టెన్ అజింక్య రహానే సారథ్యం పెద్దగా ఆకట్టుకోవడం లేదు. మరోవైపు ఘోరంగా విఫలమైన బ్యాటర్లపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.
Also Read: LSG vs PBKS: హార్డ్ హిట్టర్ల సమరం.. పరుగుల వరద ఖాయం! తుది జట్లు ఇవే
ఐపీఎల్ 2025 మెగా వేలంలో వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రూ.23.75 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసింది. వెంకటేశ్‌కు కెప్టెన్సీ ఇవ్వడానికి కూడా సిద్దమయి.. చివరలో కేకేఆర్ యాజమాన్యం వెనకడుగు వేసింది. వైస్ కెప్టెన్ బాధ్యతను అప్పగించారు. భారీ అంచనాలతో ఐపీఎల్ 2025ఓ అడుగుపెట్టిన వెంకటేశ్.. నిరాశపర్చుతున్నాడు. సీజన్ తొలి మ్యాచ్‌లో ఆర్సీబీపై 6 పరుగులు మాత్రమే చేశాడు. రాజస్థాన్‌పై బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ముంబైపై 9 బంతుల్లో 3 పరుగులు మాత్రమే చేశాడు. ఆల్‌రౌండర్‌గా పని కొనస్తాడనుకుంటే.. బౌలింగే చేయడం లేదు. డాన్స్ కేకేఆర్ అభిమానులే అతడిని టార్గెట్ చేశారు. ‘రూ.23.75 కోట్లు అవసరమా?’, ‘ఫ్రాంచైజీ నమ్మకాన్ని వమ్ము చేశాడు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.