Kashmiri Pandit shot dead: జమ్మూ కాశ్మీర్ లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. గత కొంత కాలంగా అమాయకులను, మైనారిటీలను, వలస కూలీలు, హిందూ పండిట్లను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నాయి. హైబ్రీడ్ టెర్రరిజాన్ని అవలంభిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. ఇదిలా ఉంటే తాజాగా మరో కాశ్మీరీ పండింట్ ను కాల్చి చంపారు ఉగ్రవాదులు. పుల్వామా జిల్లాలో ఆదివారం కాశ్మీరీ పండిట్ వర్గానికి చెందిన సంజయ్ శర్మని ఉగ్రవాదులు కాల్చిచంపారని పోలీసులు వెల్లడించారు.
కాశ్మీరీ పండిట్ రాహుల్ భట్ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నాయి భద్రతా బలగాలు. గురువారం రాహుల్ భట్ ను తన కార్యాలయంలో కాల్చి చంపిన ఉగ్రవాదులను భద్రతా బలగాలు శుక్రవారం జరిగిని ఎన్ కౌంటర్ లో లేపేశాయి. ఒక రోజు వ్యవధిలోనే ఉగ్రవాదులను ట్రాక్ చేసి ఎన్ కౌంటర్ లో మట్టుబెట్టారు. గురువారం బుద్గాం జిల్లా చదూరా తాహసీల్ కార్యాలయంలో రాహుల్ భట్ క్లర్క్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు టెర్రరిస్టులు కార్యాలయానికి వచ్చి రాహుల్…
జమ్మూ కాశ్మీర్ లో దారుణం చోటు చేసుకుంది. ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బుద్గాం జిల్లాలో గురువారం కాశ్మీర్ పండిట్ ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. చదూరా ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్న రాహుల్ భట్ పై కార్యాలయంలోనే దాడి చేసి హతమార్చారు. ఉగ్రవాదులు చాదూరా పట్టణంలోని తహసీల్ కార్యాలయంలోకి ప్రవేశించి అక్కడ క్లర్క్ గా పనిచేస్తున్న రాహుల్ భట్ పై కాల్పులు జరిపారు. ఘటన అనంతరం రాహుల్ భట్ ను శ్రీనగర్ లోని శ్రీ మహారాజా హరిసింగ్…
జమ్మూకాశ్మీర్ పర్యటనలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. జమ్మూకశ్మీర్‌తో మా కుటుంబానికి అనుబంధం ఉందన్న ఆయన.. తమ కుటుంబీకులు కూడా కశ్మీరీ పండిట్లేనని చెప్పారు.. ఇక్కడికి వచ్చి వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించినప్పుడు తన సొంతింటికి వచ్చినట్లు అనిపించిందన్నారు. ఇక, కొందరు కశ్మీరి పండిట్లు రాహుల్ గాంధీని కలిశారు. అయితే, వారి కోసం ఎన్నో పథకాలను కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని రాహుల్ గాంధీ. కశ్మీరీ పండిట్ సోదరులకు తన వంతు ఏదైనా సాయం చేస్తానని చెప్పారు.…