Viral News: ఫుల్ గా మందు కొట్టిన తర్వాత.. అసలు ఈ లోకాన్నే మరచిపోతారు కొందరు. వింత వింత శేష్టలతో ఏం చేస్తున్నాయో తెలియకుండా నానా హంగామా చేస్తారు. అసలు చెప్పాలంటే తాగిన వారు ప్రపంచాన్ని మరిచిపోయి.. మైకంలో మునిగితేలుతారు. ఇంకొందరైతే.. డ్యాన్స్ లు, పాటలు, అరవడం, గోల చేయడం.. కోపమొస్తే గొడవలు పెట్టుకుంటారు. చివరకు తన్నులు కూడా తింటారు. ఇలా ఉంటుంది తాగినోళ్ళతో.. అందుకే తాగినోళ్ల జోలికి వెళ్లాలంటే కొందరు భయపడుతూ ఉంటారు.
Read Also: Jabardasth Hari: ఎర్ర చందనం స్మగ్లింగ్.. పరారీలో జబర్దస్త్ నటుడు
అసలు వివరాల్లోకి వెళ్తే.. భలే భలే మగడివోయ్ సినిమాలో ఒక సీన్ గుర్తొస్తొంది.. ఈ కథ వింటే. కాదంటే ఇక్కడ తాగిన మైకం.. అక్కడ మతిమరుపు. మిగదంతా సేమ్ టు సేమ్. ఆ సినిమాలో మతిమరుపుతో ఓ బిచ్చగాడికి హీరో నాని తన బైక్ ను ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ రియల్ స్టోరీలో తాగిన మైకంలో ఓ దొంగకు తన కారును అప్పగిస్తాడు. హర్యాణాలోని గురుగ్రామ్‌లో అమిత్ ప్రకాష్(30) అనే వ్యక్తి అప్పటికే ఫుల్ గా మద్యం సేవించాడు. మళ్లీ ఆల్కహాల్ కొనుక్కోని.. కారులో సేవిద్దామనుకున్నాడు. దీంతో గోల్ఫ్ కోర్స్ రోడ్‌లోని ఓ వైన్ షాపుకెళ్లి అక్కడ ఓ మందు బాటిల్‌ను తీసుకున్నాడు. ఆ తర్వాత తన కారు దగ్గరికెళ్లి తాగడం మొదలుపెట్టాడు. ఇంతలోనే ఓ అపరిచిత వ్యక్తి అక్కడికి వచ్చాడు. నేను కూడా తాగొచ్చా అని అతడు అడగడంతో ప్రకాష్ అతనికి కూడా మద్యం ఇచ్చాడు.
Read Also: Gongura Rice : గోంగూర రైస్ ను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు..
ఆ తర్వాత వాళ్లిద్దరూ కారులో కొంత దూరం ప్రయాణించారు. ఆ తర్వాత ఆ అపరిచిత వ్యక్తి ప్రకాష్ ను కారు దిగమన్నాడు. వెంటనే కారు దిగిన ప్రకాష్.. కారు పట్టుకుని ఉడాయించాడు దొంగ. అప్పటికీ తన కారు దొంగ ఎత్తుకెళ్లాడన్న విషయం గుర్తులేదు. అక్కడి నుంచి ఇంటికి ఆటోలో వచ్చిన ప్రకాష్.. ఆ రాత్రికి పడుకున్నాడు. తెల్లారాక రాత్రి జరిగిన తతంగం అంతా గుర్తు చేసుకొని.. తాగిన మైకంలో ఓ వ్యక్తికి కారునే అప్పగించినట్లు తెలుసుకున్నాడు. ఇంకేముంది పోలీసులను ఆశ్రయించాడు. మొదటగా ప్రకాష్ మద్యం కొనుక్కోవడానికి వైన్ షాపుకి వెళ్లినప్పుడు అప్పటికే తాగిన మైకంలో ఉండటంతో రూ.2 వేల వైన్ బాటిల్‌కు రూ.20 వేలు ఇచ్చానని.. అయినప్పటికీ ఆ షాప్ ఓనర్ తనకు రూ.18 వేలు తిరిగి ఇచ్చినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత ఓ వ్యక్తితో తాగి అతనికే కారు అప్పజెప్పానని.. అందులో తన రూ.18 వేల నగదు, లాప్‌టాప్, మొబైల్ ఫోన్ కూడా ఉన్నట్లు చెప్పాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేస్తున్నారు.