కొన్ని సినిమాలు అంతే సెలెంటుగా వచ్చి డిస్కర్షన్‌కు కారణమౌతుంటాయి. ఇప్పుడు అలాంటి సెన్సేషనే క్రియేట్ చేస్తుంది గుజరాతీ ఫిల్మ్ వశ్ లెవల్2. ఆగస్టులో థియేటర్లలో రిలీజై ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చేసిన ఈ సినిమా ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం వశ్2 ఓటిటి రైట్స్ రూ. 3.5 కోట్ల వెచ్చించి మరీ దక్కించుకుందట నెట్ ఫ్లిక్స్. ఇప్పటి వరకు ఇలాంటి డీల్ ఏ గుజరాతీ సినిమాకు జరగకపోవడమే ఈ సెన్సేషన్‌కు కారణం. Also Read : Tollywood…
దక్షిణ భారతదేశంలో హిందీ భాషపై జరుగుతున్న చర్చపై స్పందించారు మాజీ సీఎం వైఎస్ జగన్.. పేద పిల్లలకు పోటీతత్వాన్ని పెంపొందించటానికి హిందీని ఒక భాషగా బోధించవచ్చన్న ఆయన.. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా మాధ్యమం ఇంగ్లీష్ అయి ఉండాలని స్పష్టం చేశారు.. ఇంగ్లీష్ ఒక ప్రపంచ భాష.. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు దానిని అనర్గళంగా నేర్పిస్తే ఉద్యోగ అవకాశాల కల్పనను సులభతరం చేస్తుందన్నారు..
దేశవ్యాప్తంగా ఉన్న యువ టాలెంట్‌ని, ఫ్యూచర్ స్క్రీన్ రైటర్లను గుర్తించి, స్పాట్‌లైట్‌లోకి తీసుకొచ్చే క్రియేటివ్ మిషన్‌గా జీ రైటర్స్ రూమ్‌ని లాంచ్ చేసినట్లు టాప్ కంటెంట్ అండ్ టెక్ పవర్‌హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (‘Z’) సూపర్ గర్వంగా ప్రకటించింది. జీ రైటర్స్ రూమ్ అనేది కేవలం టాలెంట్ హంట్ కాదు—ఇది ‘యువర్స్ ట్రూలీ Z’ అనే కంపెనీ వైబ్‌తో కనెక్ట్ అయిన సృజనాత్మక ఉద్యమం. అన్ని ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడమే దీని…
హిందీని ప్రేమిద్దాం.. మనదిగా భావిద్దాం అని వ్యాఖ్యానించారు.. మన దేశం వివిధ సంస్కృతులు ఉంటాయి.. అందరినీ హిందీ ఒక కామన్ భాషగా కలుపుతుందన్నారు.. విదేశస్తులు మన భాష నేర్చుకుంటారు.. మనం హిందీ అంటే ఎందుకు భయపడాలి..? అని ప్రశ్నించారు. హిందీ జబర్దస్త్ వస్తువు ఏమీ కాదు.. జర్మనీ, ఇతర భాషలు నేర్చుకుంటున్నాం.. కానీ, హిందీతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు..
NEET, NEPలతో తమిళ విద్య వ్యవస్థను దెబ్బ తీసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. వీటి ద్వారా తమిళనాడుపై బలవంతంగా హిందీని రుద్దుతోంది.. ఇది హిందీకి వ్యతిరేకంగా పోరాటం కేవలం భాషపై పోరాటం మాత్రమే కాదు.. తమిళ సంస్కృతిని రక్షించడానికి ఒక జాతి పోరాటం.
మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. జాతీయ విద్యా విధానం ప్రకారం త్రిభాషా సూత్రాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ ప్రింటింగ్ చేస్తోంది.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనంగా మారాయి. డీఎంకే, కేంద్ర ప్రభుత్వాల మధ్య ‘‘హిందీ’’ వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో నిన్న జనసేన ఆవిర్భావ సభలో ఈ విషయంపై పవన్ కామెంట్స్ తమిళనాట కాక పుట్టించాయి.
కేంద్రంపై నటుడు కమల్‌హాసన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలను హిందీ రాష్ట్రాలుగా మార్చి.. బీజేపీ గెలవాలనుకుంటోందని కమల్ హాసన్ ఆరోపించారు. హిందీ మాట్లాడని రాష్ట్రాలను బలవంతంగా హిందీ భాషగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
BJP: తమిళనాడు ప్రభుత్వం, కేంద్రానికి మధ్య ‘‘త్రిభాషా విధానం’’, ‘‘హిందీ భాష’’పై వివాదం నెలకొంది. జాతీయ విద్యా విధానంలో భాగంగా హిందీ భాషను తమిళనాడుపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం ఎంకే స్టాలిన్, ఆయన డీఎంకే పార్టీ ఆరోపిస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో, ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ..