Kerala: కేరళలో డ్రగ్స్ వినియోగం గురించి కొచ్చి పోలీస్ కమిషనర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో డ్రగ్స్ వినియోగం ఏ స్థాయిలో ఉందనే విషయాలను వెల్లడించారు. అన్ని స్థాయిల్లో ఉన్న పోలీస్ అధికారుల పిల్లలు కూడా డ్రగ్స్ కు బానిస అవుతున్నారని కొచ్చి పోలీస్ కమిషనర్ కే. సేతురామన్ అన్నారు. గురువారం కొచ్చి అంగమాలిలో జరిగిన కేరళ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర సదస్సులో ఐపీఎస్ సేతురామన్ ప్రసంగిస్తూ తన సహోద్యోగి కుమారుడు డ్రగ్స్‌కు బానిసై మరణించాడని అన్నారు.
Read Also: Deve Gowda: కొత్త పార్లమెంట్ బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కాదు, బహిష్కరించడానికి.. మేం హాజరవుతాం..
డ్రగ్స్ కి అన్ని స్థాయిల్లో ఉన్న పోలీస్ అధికారుల పిల్లలు బాలిసలు అవుతున్నారని, ఒక ఎస్పీ ఇద్దరు కుమారులు డ్రగ్స్ కు బానిసలయ్యారని, వారి కుటుంబం దీని కారణంగా ఇబ్బంది పడుతోందని, ఇది మనం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం అని ఆయన అన్నారు. తిరువనంతపురంలో డ్రగ్స్‌కు బానిసైన ఓ పోలీసు అధికారి చిన్నారిని హత్య చేసిన ఘటనను కూడా సేతురామన్ ప్రస్తావించారు. అయితే దేశంలో సగటు డ్రగ్స్ వినియోగం కన్నా కేరళ సగటు తక్కువగా ఉందన్నారు. ఇటీవల కేరళ పోలీసులు 21 ఏళ్లలోపు డ్రగ్స్ కు బానిస అయిన వారిపై నిర్వహించిన సర్వేలో 40 శాతం మంది 18 ఏళ్లలోపు ఉన్నవారేనన్న షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.