Kerala: కేరళ రాజధాని తిరువనంతపురం తూర్పు కోటలో ఉన్న శ్రీ పద్మనాథ స్వామి ఆలయానికి సంబంధించి కీలక సమాచారం వెలువడింది. ఆలయంలో ఇటీవల బంగారం మాయమైన విషయం తెలిసిందే. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే బంగారం దొరికింది. గోల్డ్ దొరికినప్పటికీ ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బంగారు పూత కోసం గోల్డ్ నాణేలను తీశారు. ఆ సమయంలో స్ట్రాంగ్ రూమ్‌లోని సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదని దర్యాప్తులో తేలింది.
Kerala: కేరళలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కేరళ పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఒక రాజకీయ నాయకుడు, ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఒక ఫుట్ బాల్ కోచ్ ఉన్నారు. నిందితులు గే డేటింగ్ యాప్‌లో సదరు బాలుడితో స్నేహం చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల కూలీ సినిమాతో తెలుగు ప్రేక్షకులలో కూడా మంచి పాపులారిటీ సంపాదించిన సౌబిన్ షాహీర్, అనుకోకుండా చిక్కుల్లో చిక్కుకున్నాడు. నిజానికి అతనే లీడ్‌గా, నిర్మాతగా మంజుమ్మల్ బాయ్స్ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాకి సంబంధించి ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసు నమోదు అవ్వగా, అతన్ని కేరళలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితోపాటు సినిమాకి సహనిర్మాతలుగా వ్యవహరించిన వారిని కూడా అరెస్ట్ చేశారు. అయితే, తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. Also Read:Samantha: సమంత పట్టుకున్న…
Kerala: పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడంపై యావత్ దేశం బాధపడుతుంటే, మరికొందరు మాత్రం ఈ ఘటనపై వివాదాస్పద కామెంట్స్, సోషల్ మీడియా పోస్టు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఇలాంటి సమయంలో సంయమనం, సంఘీభావం ప్రకటించాల్సింది పోయి, కొందరు తెలివి తక్కువ రాజకీయ నాయకులు రెచ్చగొట్టే పోస్టులు చేస్తున్నారు.
కేరళలోని శబరిమల అయ్యప్ప భక్తులకు పోలీసులు గుడ్‌న్యూస్ చెప్పారు. శబరిమల అయ్యప్ప ఆలయంలో వార్షిక మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమైంది. 41 రోజుల పాటు సాగే ఈ పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం కోసం వస్తున్నారు. భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ పోలీసులు ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించారు. జిల్లా పోలీసు చీఫ్ వి.జి. వినోద్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు సైబర్ సెల్ 'శబరిమల - పోలీస్ గైడ్'…
Kerala Police Issued Lookout Notice against actor Siddique in Harassment Case: అత్యాచారం కేసులో నిందితుడైన నటుడు సిద్ధిక్‌పై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది. సిద్ధిక్‌ను పట్టుకునేందుకు దర్యాప్తు బృందం మీడియాలో లుక్‌అవుట్ నోటీసు జారీ చేసింది. లుకౌట్ నోటీసును మలయాళ దినపత్రికలలో ప్రచురించారు. మ్యూజియం స్టేషన్‌లో నమోదైన కేసులో సిద్ధిక్ నిందితుడని, సమాచారం తెలిసిన వారు పోలీసులకు తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడానికి ఫోన్ నంబర్ కూడా…
Isro spy case: ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ కేసులో సీబీఐ చివరి ఛార్జిషీట్‌ని దాఖలు చేసింది. జూన్ చివరి వారంలో దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లో సంచలన విషయాలను పేర్కొంది. 1994 ఇస్రో గూఢచర్యం కేసులో మాజీ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ని కేరళ పోలీస్ తప్పుగా ఇరికించారని పేర్కొంది.
Kerala Bomb Blast: కేరళలోని కలమస్సేరిలో ‘యెహోవా విట్‌నెస్’ క్రైస్తవ సమూహం ప్రార్థనల సమయంలో వరసగా మూడు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో దేశం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ చర్యలో ఏదైనా ఉగ్రవాద కోణం ఉందా..? అని ఇప్పటికే ఎన్ఐఏ విచారణ జరుపుతోంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒకరు మరణించగా.. 45 మంది గాయపడ్డారు. నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు జరగాయని, పేలుళ్లలో ఐఈడీని టిఫిన్ బాక్సుల్లో అమర్చినట్లు పోలీసులు వెల్లడించారు.
డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో సోదాలకు వెళ్లిన పోలీసులకు భయానక అనుభవం ఎదురైంది. అనుమానిత డ్రగ్ డీలర్ ఇంట్లో ఆకస్మిక తనిఖీ చేపట్టిన పోలీసులపై ఒక్కసారిగా కుక్కలు దాడి చేశాయి.