ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్యానాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో ఏ ప్రభుత్వం కొలువుదీరినా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుతోనే సాధ్యమవుతుందన్నారు. ఆప్ మంచి స్థాయిలో స్ధానాలను చేజిక్కించుకుంటుందని తెలిపారు. తమ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.
MP Sanjay Singh: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన అధికారిక నివాసాన్ని వారం రోజుల్లో ఖాళీ చేస్తారని.. ప్రభుత్వ సౌకర్యాలన్నింటినీ వదులుకుంటారని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఈరోజు (బుధవారం) తెలిపారు.