ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వాసం మరోమారు రుజువైందన్నారు.. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా నరేంద్ర మోడీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకంగా పేర్కొన్నారు..
Madhu Sudhan Reddy: కేటీఆర్ మాటలు మూసి కంపు కంటే ఎక్కువ కంపు కొడుతున్నాయని.. హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోతే సంబురాలు చేసుకుంటున్నాడని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. బీజేపీ గెలిచిందని సంకలు గుద్దుకుంటుండని., అక్కడ ఈవీఎంలు అవకతవకలు త్వరలో బయట పడతాయని., కాశ్మీర్ లో బీజేపీ ఓడిపోతే చప్పుడు చెయట్లేదని., రాహుల్ గాంధీ పై కేటీఆర్, హరీష్ రావులు విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. మోరిగే కుక్క కరవదు. కేటీఆర్ మాటలు ఎవరు పట్టించుకోరని., కేటీఆర్…
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానా ఫలితాలను తాము అంగీకరించడం లేదని తెలిపారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. హర్యానా ఫలితాలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. హర్యానా ఫలితాలపై చాలా ఫిర్యాదులు ఉన్నాయని తెలిపారు.
Shivraj Singh Chouhan: ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో ఘన విజయం సాధించింది. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలను కాంగ్రెస్ నుంచి గెలుచుకోగా.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారం నిలుపుకుంది. కేవలం తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. అయితే ఈ మూడు రాష్ట్రాల్లో కూడా బీజేపీ మాజీ సీఎంలను కాదని కొత్త ముఖాలను సీఎంలుగా ఎన్నుకుంది.
Anurag Thakur: బీజేపీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ గెలుపును ఉద్దేశిస్తూ గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందని, దక్షిణ భారత దేశంలో గెలవదని డీఎంకే పార్టీ ఎంపీ సెంథిల్ కుమార్ పార్లమెంట్‌లో వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది. అయితే ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది.
DMK MP: డీఎంకే ఎంపీ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. బీజేపీ విజయాన్ని ప్రస్తావిస్తూ.. డీఎంకే ఎంపీ డీఎన్వీ సెంథిల్ కుమార్ మంగళవారం లోక్‌సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీని విమర్శిస్తూ ఆయన వ్యాఖ్యలు చేయడంపై వివాదం రాజుకుంది. బీజేపీ విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘‘ప్రధానంగా హిందీ హార్ట్ ల్యాండ్ రాష్ట్రాల్లో లేదా మేము గోమూత్ర రాష్ట్రాలుగా పిలుస్తాము వీటిలో బీజేపీ గెలుస్తుందని, మీరు దక్షిణ భారతదేశానికి రాలేరు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు, కేరళ,…
Gujarati fan made a golden statue of Prime Minister Narendra Modi: ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టించింది బీజేపీ. మొత్తం 182 స్థానాలకు గానూ 156 స్థానాల్లో విజయం సాధించింది. ఏకపక్షంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఘోరంగా ఓడిపోయాయి. ఇదిలా ఉంటే ఈ విజయాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ అభిమాని ఒకరు ఏకంగా 156 గ్రాముల బంగారంతో మోదీ ప్రతిమను తయారు చేశాడు.
BJP on the way to a huge victory in Gujarat elections: గుజరాత్ రాష్ట్రంలో చరిత్ర సృష్టించింది భారతీయ జనతా పార్టీ(బీజేపీ). గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించే దిశగా వెళ్తోంది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉంటే.. బీజేపీ ఏకంగా 154 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ దారుణంగా చతికిల పడింది కేవలం 19 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే బీజేపీ…
తెలంగాణ గురించి ఆలోచించకుండా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి కలలు కంటున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్. కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ కలలు కంటున్నాడు. కొందరు నిద్రలో కలలు కంటే ఇతను పగటి కలలు కంటున్నాడు. కేసీఆర్ కలలు నెరవేరవు. ఎనిమిదేళ్ళలో నీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసింది? ఇన్ని రోజులు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కొత్త హామీలతో ప్రజల ముందుకి కేసీఆర్ ఎలా వెళ్తాడని ప్రశ్నించారు తరుణ్ చుగ్.…
తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేస్తాం, దేశంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీజేపీయే అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈనెల 31న 11 వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల ఖాతాలో జమ ఈ సందర్భంగా మోడీ ప్రసంగించనున్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని జిల్లాలో కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాను.. ఇది పార్టీ ప్రోగ్రాం కాదని గుర్తుంచుకోవాలి. కేంద్రంలో లో కాంగ్రెసేతర ప్రభుత్వం…