Delhi New CM Oath: దేశ రాజధాని కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించి రాంలీలా మైదానం ముస్తాబైంది. ఏర్పాట్లను భారతీయ జనతా పార్టీ పూర్తి చేసింది. భద్రతా కారణాలతో గ్రౌండ్ ను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ హస్తగతం చేసుకుంది. రేపు మధ్యాహ్నం 12. 05 గంటలకు సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.