దేశ రాజధానిలో ఎయిడ్స్ రోగులు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. గత కొన్ని నెలులుగా ఎయిడ్స్ వ్యాధిని నిరోధించే యాంటీ రెట్రో వైరల్ మందులు కొరత ఉంది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఢిల్లీలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. హెచ్ఐవీ రోగులకు అవసరమైన, వైరస్ బారి నుంచి కాపాడే మందులు గత 5 నెలలుగా ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాల్లో అందుబాటులో లేవు. దీంతో రోగులు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా.. ఫలితం లేకపోయిందని రోగులు వాపోతున్నారు. మందులు స్టాక్ లో లేవని.. కొరతగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఇలా అయితే భారత్ ను హెచ్ఐవీ రహితదేశంగా ఎలా మారుస్తారని.. రోగులు ప్రశ్నిస్తున్నారు.
Read Also: Mahendra Singh Dhoni: ధోనీకి షాక్.. సుప్రీంకోర్టు నోటీసులు
హెచ్ఐవీ వ్యాధి పూర్తిగా నయంకాకున్నా యాంటీ రెట్రో వైరల్ డ్రగ్స్ తో బాడీలో వైరస్ లోడ్ పెరగకుండా.. రోగులు ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవించేలా ఈ మందులు సహయపడుతాయి. శరీరంలో ఉన్న హెచ్ఐవీ వైరస్ తన జనాభాను పెంచుకోకుండా యాంటీ రెట్రో వైరల్ మందులు అడ్డుకుంటాయి. ఫలితంగా రోగులు మరింత కాలం జీవించే అవకాశం ఏర్పడుతుంది. అయితే ఈ మందులు అందుబాటులో లేకపోవడంతో హెచ్ఐవీ రోగులు ఆందోళనకు గురవుతున్నారు.