ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు… అనే మాట అక్షర సత్యం. ఎక్కడ ఎలాంటి ప్రమాదం పొంచి ఉంటుందో, ఎటు నుంచి ప్రమాదం దూసుకొస్తుందో ఎవరూ చెప్పలేరు. ప్రతి నిమిషం జాగ్రత్తగా, అంతకు మించి అలర్ట్ గా ఉండాలి. రోడ్డుపై తిరిగే మనిషి నుంచి అడవుల్లో సంచరించే జంతువుల వరకు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటేనే ప్రాణాలు నిలుస్తాయి. ఏమరుపాటుగా ఉంటే ఈ శునకంలా ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది. దాహం తీర్చుకోవడానికి ఓ శునకం నది ఒడ్డుకు వచ్చింది. నదిలో నీళ్లు తాగుతుండగా అమాంతంగా మొసలి దాడిచేసి శునకాన్ని చంపి తినేసింది. అప్పటికీ ఆ శునకం తప్పించుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఈ సంఘటన రాజస్థాన్‌లోని కోట జిల్లాలో జరిగింది. కోట జిల్లాలోని చంబల్ నదిపై రానా ప్రతాప్ సాగర్ ఆనకట్ట ఉంది. ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో మొసళ్లు సంచరిస్తుంటాయని, అప్పుడప్పుడు అవి ఒడ్డుకు వచ్చి సేద తీరుతుంటాయని అధికారులు చెబుతున్నారు.