UPI: యూపీఐ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన..సామాన్యులకు ఊరట..
- యూపీఐ ఛార్జీలపై ఊహాగానాలను కొట్టిపారేసిన కేంద్రం..
- సాధారణ వినియోగదారులకు ఉచితమే అని ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPI: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వినియోగదారులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలు ఉంటాయని ప్రజలు ఆందోళన చెందుతున్న వేళ, కేంద్రం కీలక ప్రకటన చేసింది. యూపీఐ వినియోగదారులకు ఇకపై ఉచితంగానే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం శనివారం స్పష్టం చేసింది. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారుల నుంచి ఎలాంటి లావాదేవీ రుసుము వసూలు చేయబోమని చెప్పింది. అయితే, భవిష్యత్తులో పరిమిత సంఖ్యలో వ్యాపార లావాదేవీలపై స్వల్ప మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) విధించే అవకాశం ఉందని వెల్లడించింది.
పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ యాక్ట్(పీఎస్ఎస్ యాక్ట్)లో ప్రతిపాదించిన సవరణపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్రం ఈ ప్రకటన చేసింది. సాధారణ వినియోగదారులపై ఛార్జీలు విధించేందుకు ఈ సవరణలు తీసుకువచ్చారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది.
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్‌మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్పినదాని ప్రకారం.. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే (P2P) యూపీఐ లావాదేవీలు పూర్తిగా ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది. అదేవిధంగా అత్యధిక సంఖ్యలో జరిగే వ్యాపార లావాదేవీలపైనా ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ భవిష్యత్తులో ఎండీఆర్ ప్రవేశపెడితే, అది నిర్దిష్ట పరిమితికి మించిన కొన్ని ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని చెప్పింది. ఈ ఛార్జీలు కూడా నామమాత్రంగానే ఉంటాయని, డెబిల్ లేదా క్రెడిట్ కార్డులపై ప్రస్తుతం వర్తించే ఎండీఆర్‌తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. అన్ని యూపీఐ లావాదేవీలపై ఒకే విధంగా ఛార్జీలు విధించే విధానం ఉండదని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!