Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
- వర్షాకాలంలో తేమ, సూర్యరశ్మి లేకపోవడం వల్ల బట్టలకు దుర్వాసన వచ్చే అవకాశం..
- బట్టలను పూర్తిగా ఆరబెట్టకపోతే వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి వాసన..
- ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Clothes Smell: వర్షాకాలంలో ఇంట్లో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో బట్టలకు ఉండే తేమ వల్ల వాసన కూడా ఒకటి. వరుసగా వర్షాలు పడటం, సూర్యరశ్మి సరిగ్గా అందకపోవడంతో బట్టలు పూర్తిగా ఆరకపోవచ్చు. దీంతో వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి దుర్వాసన రావడం మొదలవుతుంది. కాటన్ బట్టలతో పాటు ఖరీదైన సిల్క్ దుస్తులకు కూడా ఈ సమస్య ఎదురవుతుంది. అంతేకాదు.. అల్మారాలో జాగ్రత్తగా మడతపెట్టి పెట్టిన బట్టలు కూడా తేమ కారణంగా వాసన రావచ్చు. అయితే కొన్ని సింపుల్ “హోం హ్యాక్స్” పాటిస్తే ఈ సమస్యను చాలావరకు తగ్గించుకోవచ్చు. మరి బట్టలకు పూలలాంటి సువాసన రావాలంటే ఈ చిట్కాలు పాటించండి.
వైట్ వెనిగర్, బేకింగ్ సోడా:
కాటన్ బట్టలను ఉతికేటప్పుడు చివరి రిన్స్ నీటిలో అర కప్పు వైట్ వెనిగర్ లేదా 1 లేదా 2 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపవచ్చు. ఇవి బట్టల్లో ఉన్న దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే వెనిగర్, బేకింగ్ సోడాను ఒకేసారి కలిపి ఉపయోగించకుండా.. విడివిడిగా ఉపయోగించడం మంచిది.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
ఎసెన్షియల్ ఆయిల్ స్ప్రే:
లావెండర్, రోజ్ లేదా లెమన్‌గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్లో 5 చుక్కలను ఒక కప్పు నీటిలో కలిపి స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు. బట్టలు పూర్తిగా తడిగా కాకుండా స్వల్పంగా తేమగా ఉన్నప్పుడు దూరం నుంచి కాస్త స్ప్రే చేయాలి. ముందుగా బట్టలోని కనిపించని చిన్న భాగంపై పరీక్షించడం మంచిది. ముఖ్యంగా సిల్క్ దుస్తుల విషయంలో జాగ్రత్త అవసరం.
కర్పూరం, నాఫ్తలీన్ బాల్స్:
అల్మారాలోని తేమ, పురుగుల సమస్యను తగ్గించడానికి కర్పూరం లేదా నాఫ్తలీన్ బాల్స్‌ను ఉపయోగిస్తుంటారు. వీటిని బట్టలకు నేరుగా తగలకుండా చిన్న పొట్లంలో వేసి అల్మారా మూలల్లో ఉంచవచ్చు. అయితే నాఫ్తలీన్ బాల్స్‌ను పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.
కర్పూరం, లవంగాలతో సహజ ఫ్రెషనర్:
ఒక చిన్న కాటన్ క్లాత్‌లో కర్పూరం, 5 లవంగాలు, కొద్దిగా వాము వేసి మూటలా కట్టి బట్టలు ఉండే ప్రదేశంలో వేలాడదీయవచ్చు. వీటి సువాసనతో అల్మారా లేదా గదిలో తాజా వాసన ఉండేలా చేసుకోవచ్చు. అయితే ఇది తేమకు ప్రధాన పరిష్కారం కాదు. గదిలో వెంటిలేషన్, బట్టలు పూర్తిగా ఆరబెట్టడం కూడా ముఖ్యమే.
ఫ్యాబ్రిక్ సాఫ్టెనర్:
కాటన్ దుస్తులకు తగిన ఫ్యాబ్రిక్ కండిషనర్ లేదా సాఫ్టెనర్‌ను ఉపయోగించడం ద్వారా బట్టలకు మంచి వాసన వచ్చేలా చేసుకోవచ్చు. అయితే సిల్క్ వంటి సున్నితమైన వస్త్రాలకు సాధారణ సాఫ్టెనర్ ఉపయోగించే ముందు దాని లేబుల్ సూచనలు తప్పనిసరిగా పరిశీలించాలి.
వార్మ్ ఐరన్:
స్వల్పంగా తేమ ఉండి వాసన వస్తున్న కాటన్ బట్టలపై పలుచని కాటన్ వస్త్రాన్ని ఉంచి తక్కువ లేదా తగిన ఉష్ణోగ్రతలో ఐరన్ చేయవచ్చు. వేడి వల్ల మిగిలిన తేమ ఆవిరై బట్టలు త్వరగా ఆరేందుకు సహాయపడుతుంది. సిల్క్ దుస్తులపై నేరుగా అధిక వేడి ఐరన్ చేయకూడదు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..