Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- యువత కంటే ఎవరూ గొప్పవారు కాదు
- ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’!
- కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశ యువతకు వ్యవస్థ పదేపదే అన్యాయం చేస్తోందని ఆరోపించారు. శనివారం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన ‘చత్రోం కి గూంజ్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. యువతే దేశానికి అసలైన శక్తి, గర్వకారణమని అన్నారు. ‘‘దేశ యువత కంటే ఎవరూ గొప్పవారు కాదు.. మీరే భారతదేశ శక్తి, గర్వం. నేను ఇలా చెబుతున్నప్పుడు ప్రతి భారతీయ పౌరుడి గురించి మాట్లాడుతున్నాను’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
భారత యువతలో అపారమైన ప్రతిభ ఉందని అన్నారు. చైనా, రష్యా దేశాల యువతతో పోలిస్తే భారత యువత ఎంతో ప్రతిభావంతులని పేర్కొన్నారు. అయితే తమలోని ప్రతిభను నిరూపించుకునేందుకు భారత యువతకు సమాన అవకాశాలు లభించడం లేదని ఆరోపించారు. ‘‘ఈ సాయంత్రం నేను మూడు అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అవి బాధ, డేటా, సంపద’’ అని అన్నారు. దేశంలోని సుమారు 40 కోట్ల మంది యువతే భారతదేశానికి అతిపెద్ద బలమని పేర్కొన్నారు. అమెరికా, చైనా, రష్యా గురించి తరచూ చర్చ జరుగుతుంటుందని.. కానీ భారత యువతకు సాటిలేరని అన్నారు.
Also Read
- UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
దేశంలోని విద్యా వ్యవస్థపై కూడా రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్‌లో డిగ్రీ సర్టిఫికెట్‌కు పెద్దగా విలువ లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు. డిగ్రీ పొందిన తర్వాత కూడా ఉద్యోగం లభించకపోవడంతో విద్యార్హతలు నిరర్థకంగా మారుతున్నాయని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. దేశ యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అన్నారు.
‘చత్రోం కి గూంజ్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ శనివారం మధ్యాహ్నం ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. అనంతరం కేపీ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత తన పూర్వీకుల నివాసమైన ఆనంద్ భవన్-స్వరాజ్ భవన్‌కు వెళ్లారు. ప్రయాగ్‌రాజ్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికినట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తెలిపారు. అలహాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ ఉజ్వల్ రమణ్ సింగ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పార్టీ కార్యాలయ బాధ్యులు, కార్యకర్తలతో రాహుల్ సమావేశమయ్యారు.
రాహుల్ గాంధీ కార్యక్రమానికి ముందు ప్రయాగ్‌రాజ్‌లో ఆయనకు మద్దతుగా పలు పోస్టర్లు, హోర్డింగ్‌లు కనిపించాయి. ‘‘మాకు ఉద్యోగాలు కావాలి.. పెల్లెట్ గన్స్ కాదు’’, ‘‘మంత్రి గారి పెద్ద కారు.. దేశ యువత నిరుద్యోగం’’ వంటి నినాదాలతో పోస్టర్లు ఏర్పాటు చేశారు. మరో హోర్డింగ్‌లో రాహుల్ గాంధీ చిత్రంతో పాటు ‘‘ఉద్యోగం రాకపోతే సింహాసనం కదులుతుంది’’ అనే నినాదాన్ని ప్రదర్శించారు.
ఇదిలా ఉంటే ‘చత్రోం కి గూంజ్’ కార్యక్రమానికి పోలీసుల నుంచి అనుమతి లభించిందని, కొన్ని షరతులతో కార్యక్రమం నిర్వహించేందుకు అవసరమైన అన్ని అనుమతులు పొందినట్లు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ తెలిపారు.
తాజావార్తలు
-
KBR Park Elevated Corridor: 14 ఫ్లై ఓవర్స్ వద్దు.. ఒక్క ఎలివేటెడ్ కారిడార్ ముద్దు.! కేబీఆర్ పార్క్ పరిసరాల్లో కొత్త ప్లాన్ ఇదే..
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Salman Khan: కర్ణుడిగా సల్మాన్ ఖాన్.. ‘రంగ్ దే బసంతి’ దర్శకుడితో భారీ ప్రాజెక్ట్!
-
MLA Rakesh Reddy: జోక్ కాదు సీరియస్ అధ్యక్షా.. ఈరోజే రాజీనామా చేస్తా.. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఫైర్.!
-
UPI MDR Revenue: MDR ఆదాయంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ డబ్బుతో ఏం చేస్తారంటే..?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!