BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
- వెంకట నరసమ్మ స్వస్థలం ఖమ్మం జిల్లా తుమ్మూరు
- మూడు రోజుల క్రితం అదృశ్యమైన వెంకట నరసమ్మ
- అల్లుడు తిరుపతిరావుపై పోలీసులకు అనుమానం
- నరసమ్మను హత్య చేసినట్లు అంగీకరించిన అల్లుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BE ALERT: పిల్లనిచ్చిన అత్తను చంపేశాడు.. ఆ తర్వాత డెడ్‌బాడీ దాచేశాడు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి తగలబెట్టేశాడు. మళ్లీ ఏం తెలియనట్టు నటించాడు. కానీ అనుమానంతో కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో నిజాలు బయటకు వచ్చాయి. పోలీసుల విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇంతకీ ఎవరా కిల్లర్ అల్లుడు? అత్తను హత్య చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అసలు ఈ కేసులో ఏం జరిగింది? ఈ ఫోటోలో ఉన్న మహిళ పేరు వెదుళ్ల వెంకట నరసమ్మ. ఖమ్మం జిల్లా తుమ్మూరు ఆమె స్వస్థలం. వెంకట నరసమ్మ మూడు రోజుల క్రితం అదృశ్యమయ్యారు. తెలిసి వారి ఇళ్లు, బంధువుల వద్ద అంతా వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నరసమ్మ అదృశ్యం వెనుక ఆమె అల్లుడు తిరుపతిరావుపై పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నరసమ్మను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. నరసమ్మకు చెందిన ఆస్తి విషయంలో వివాదం ఉండటంతో.. ఆస్తి వివాదమే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే నరసమ్మ కుటుంబ సభ్యులు మాత్రం మరో కోణాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. తిరుపతిరావుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని.. ఈ విషయం నరసమ్మకు తెలియడంతో ఆమె తన కుమార్తెతో కలిసి అల్లుడు తిరుపతిరావును మందలించారని ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని కక్ష పెంచుకున్న తిరుపతిరావు.. నరసమ్మను హత్య చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తిరుపతిరావు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు.. క్లూస్ టీమ్‌తో కలిసి నరసమ్మ మృతదేహం కోసం గ్రామ శివారులోని ప్రాంతాల్లో గాలించారు. నారాయణపురం గ్రామ శివారులోని చెత్త ప్రాంతంలో మృతదేహాన్ని తగలబెట్టిన ఆనవాళ్లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా కాలిపోవడంతో.. అక్కడ లభించిన బూడిదలోని ఎముకలను పోలీసులు సేకరించారు. వాటిని తదుపరి పరీక్షలకు పంపనున్నట్లు తెలుస్తోంది. అసలు నరసమ్మ హత్యకు కారణం ఆస్తి వివాదమేనా..? లేక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న వివాహేతర సంబంధం వ్యవహారమేనా..? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది…హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.
Also Read
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
తాజావార్తలు
-
Bank Strike Update: మూడు రోజుల సమ్మె వాయిదా.. కీలక కమిటీ ఏర్పాటు.. బ్యాంకులకు ఇక 5 రోజుల పని విధానమా?
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?