భారత రైల్వే రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. సరుకు రవాణాలో కూడా ముఖ్య భూమిక పోషిస్తోంది. సౌకర్యవంతం, సురక్షితం, చౌకైన రవాణా వ్యవస్థగా పేరొందింది. అందుకే దీనిని దేశ జీవనాడి అని కూడా పిలుస్తారు. రైలులో ప్రయాణించేటప్పుడు, మీరు చాలాసార్లు క్రాసింగ్లను దాటుతున్న రైళ్లను చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా అన్ని వైపుల నుంచి రైళ్లు ప్రయాణించి, ఒకదానికొకటి ఢీకొనని రైల్వే క్రాసింగ్‌ను చూశారా?…
రైల్వే ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ రైల్వేస్.. చలికాలాన్ని దృష్టిలో పెట్టుకుని.. వందే భారత్ స్లీపర్ క్లాస్ రైళ్లలో.. ప్రయాణీకుల కోసం వేడి నీటిని సదుపాయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. అయితే ఎప్పటికప్పడు రైల్వే శాఖ ప్రయాణీకుల కోసం కొత్త కొత్త సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది. దూర ప్రయాణాలు చేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ క్లాస్ ఏసీ ప్రయాణీకులకు ఈ సేవలు ఉచితంగా అందించనుంది.…
Montha Cyclone: మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాన్ ప్రభావం రెండో రోజు సైతం రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అనేక రైళ్లు రద్దు చేశారు.మొత్తం 122 రైళ్లు పూర్తిగా రద్దు చేయగా.. 14 రైళ్లు దారి మళ్లించారు. 28 రైళ్లు రీ-షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. డోర్నకల్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో ట్రాక్‌పై భారీగా…
రైళ్లలో అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు ఫేక్ టీటీఈ(ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) లుగా, టీసీలు(టికెట్ చెక్కర్స్)గా అవతారమెత్తి ప్రయాణికుల నుంచి వసూళ్లకు పాల్పడుతుంటారు. ఆ తర్వాత పోలీసులకు దొరికిపోతుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి కూడా ఇదేవిధంగా ఫేక్ టీటీఈగా వ్యవహరిస్తూ పోలీసులకు పట్టబడ్డాడు. అయితే ఇక్కడ షాకిచ్చే విషయం ఏంటంటే? ఓ ఆర్మీ జవాన్ నకిలీ టీటీఈగా వసూళ్లకు పాల్పడడం. రైలులో ప్రయాణికుల నుండి డబ్బు వసూలు చేస్తూ పట్టుబడ్డాడు. ఈ సంఘటన ఝాన్సీ నుంచి గ్వాలియర్‌కు…
మహిళలు, యువతుల పట్ల వేధింపులు ఆగడం లేదు. ఆఫీసుల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేధింపులకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. వెకిలి చేష్టలు, అసభ్య ప్రవర్తనలతో రెచ్చిపోతున్నారు ఆకతాయిలు. తాజాగా సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగుచూసింది. కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తను మనిషి అన్న సంగతి మరిచాడు. కూతురు వయసున్న బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పక్కనే కూర్చుని బాలికపై చేయి వేసి అసభ్యంగా తాకుతూ మృగంలా ప్రవర్తించాడు. ఈ తతంగాన్నంతా పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు…
X Mark On Train Coach: భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన రవాణా మార్గాల్లో ముందు వరుసలో ఉండేది ఇండియన్ రైల్వే. ఇప్పటికీ ఇండియాలో రైల్వేలు అత్యంత ప్రాచుర్యం పొందిన రవాణా మార్గాలలో ఒకటిగా ఉన్నాయి. వాస్తవానికి ప్రజల్లో రైల్వేల పట్ల ఆదరణకు ప్రధాన కారణం ఇవి సులభంగా, సౌకర్యవంతంగా ఉంటాయి. అలాగే ఇండియన్ రైల్వేలు దేశవ్యాప్తంగా అద్భుతమైన కనెక్టివిటీని కలిగి ఉండటం మరొక ప్రధాన కారణం. READ ALSO: Sundar Pichai: గూగుల్ కంటే ముందే ఓపెన్-ఏఐ…
Shocking Incident: ఈ మధ్య కాలంలో రైలు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారి సంఖ్య ఎక్కవుతుంది. ఇందుకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఇలాంటి మరో సంఘటన హౌరా నుంచి రిషికేశ్ వెళ్లే డూన్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. టికెట్ తనిఖీకి వెళ్లిన టీటీఈకి దారుణ సంఘటన ఎదురైంది. ఇందుకు సంబంధించిన ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఉన్న చార్బాగ్ రైల్వే స్టేషన్లో స్లీపర్ బోగీ…
Railways: మీరు ప్రయాణం కోసం రైల్ టికెట్ బుక్ చేసుకున్నారు, హఠాత్తుగా వెళ్లాల్సిన కార్యక్రమం తేదీ మారింది. అలాంటి సమయంలో జర్నీ డేట్ మార్చడానికి గతంలో వీలు కలిగేది కాదు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందుల్ని తీర్చడానికి భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మొదటిసారిగా బుక్ చేసుకున్న టికెట్ల, ప్రయాణ తేదీలను మార్చడానికి అనుమతినిచ్చింది.
Vande Bharat Sleeper Trains: దేశవ్యాప్తంగా వందే భారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. వీటికి మంచి ఆదరణ లభించడంతో.. వందే భారత్ స్లీపర్స్‌ను తెచ్చేందుకు కేంద్రం రెడీ అయ్యింది.
దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను దీపావళి నాటికి ప్రారంభించేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాజధాని ఢిల్లీ నుండి భోపాల్, అహ్మదాబాద్, పాట్నా మార్గాల్లో స్లీపర్ వందే భారత్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. పండుగ సీజన్లో భారతీయ రైల్వే ప్రయాణీకులకు పెద్ద బహుమతి ఇవ్వబోతోంది. దీపావళి నాటికి దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. రాజధాని ఢిల్లీ నుండి భోపాల్,…