TGRTC New Logo: రవాణా శాఖ కొత్త లోగో విడుదల.. ఆర్టీసీ విజయాలపై బ్రోచర్
- రవాణా శాఖ నూతన లోగో
- తెలంగాణ ఆర్టీసీ సాధించిన విజయాలపై బ్రోచర్ విడుదల చేసిన సీఎం
- తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర కీలకమన్న రేవంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవాణా శాఖ నూతన లోగోను, తెలంగాణ ఆర్టీసీ సాధించిన విజయాలపై సీఎం రేవంత్ రెడ్డి బ్రోచర్ విడుదల చేశారు. తెలంగాణ ఆర్టీసీలో మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాలు అందించారు. రవాణాశాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలకు సీఎం హాజరయ్యారు. ఇందులో భాగంగా రవాణా శాఖ సాధించిన విజయాలపై ఐమాక్స్ థియేటర్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్లో జరుగుతున్న సభకు ముఖ్యమంత్రితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బహిరంగ సభలో లోగోతోపాటు, రవాణా శాఖ, తెలంగాణ ఆర్టీసీ సాధించిన విజయాలపై బ్రౌచర్ విడుదల చేశారు. సభా వేదికగా స్క్రాపింగ్ పాలసీ ఆర్డర్‌ను రేవంత్ రెడ్డి ప్రకటించారు.
READ MORE: Human Washing Machine: ఓరి దేవుడా మనుషులకు స్నానం చేయించే మెషీన్లు కూడా వచ్చేశాయ్..
Also Read
- Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
- Cyber Crime Crackdown: సైబర్ ముఠాలపై బిగ్ ఆపరేషన్.. 100 మందికి పైగా అరెస్ట్..
- Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
- Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..”తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్ర కీలకం.. సకలజనుల సమ్మెలో ఆర్టీసీ కీలకంగా పని చేసింది.. ఆర్టీసీని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాం..బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం అందిస్తున్నాం.. కేసీఆర్ పాలనలో ఆర్టీసీకి తీవ్ర అన్యాయం జరిగింది.. తెలంగాణలో రవాణాశాఖను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది” అని వ్యాఖ్యానించారు.
READ MORE: Pushpa 2: ‘పుష్ప 2’ వేయలేదని థియేటర్ పై రాళ్ల దాడి
కాగా.. ఇటీవల రాష్ట్ర రవాణా శాఖలో నూతన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందుకుంటున్నారు. చాలా కాలం తర్వాత భారీ స్థాయిలో రవాణాశాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ ఖాళీలను ఇటీవలే భర్తీ చేశారు. రెండేళ్లక్రితం 31 డిసెంబర్ 2022వ తేదీన ఏఎంవీఐల కొలువుల కోసం నోటిఫికేషన్ జారీచేశారు. ఆ తర్వాత పరీక్షలు నిర్వహించారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో ఇటీవల రేవంత్ రెడ్డి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేశారు.
తాజావార్తలు
-
Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
-
ICC Player of the Month: సెప్టెంబర్ ఐసీసీ అవార్డు రేసులో ఆరుగురు స్టార్లు.. భారత్ నుంచి నలుగురికి చోటు..
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!