AP CS Vijayanand: విజయవాడలో స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఏపీ సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు. డ్రోన్లతో కాలువల స్ప్రేయింగ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీలో ఏపీ సీఎస్ సైతం పాల్గొన్నారు. యుర్వేదిక్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ దగ్గర ఏర్పాటు చేసిన పారిశుధ్య విధానాల స్టాల్స్ ను ఆయన పరిశీలించారు. ఇక, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ.. పారిశుధ్యంగా ఉంటే అనారోగ్యం కలుగదు అని తెలిపారు. తడిచెత్త, పొడిచెత్త వేరు చేయడం చాలా అవసరం.. పారిశుధ్యంలో అధునాతన సాంకేతిక విధానాలను వినియోగించాలని సూచనలు జారీ చేశారు.
Read Also: Donald Trump : ట్రంప్, మస్క్ నిర్ణయం కారణంగా రోడ్డున పడ్డ 10వేల మంది
ఇక, ప్లాస్టిక్ ను నిషేధించడం ద్వారా స్వచ్ఛతను అరికట్టవచ్చు అని ఏపీ సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారణ చాలా అవసరం.. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని వెల్లడించారు. మరోవైపు, ఈరోజు నెల్లూరు జిల్లాలోని కందుకూరులో సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర- స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు.