illicit Relationship: బీహార్‌లోని సీతామర్హిలో దారుణం చోటు చేసుకుంది. తన స్నేహితుడి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో 22 ఏళ్ల వ్యక్తిని కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. అయితే, వివరాల్లోకి వెళితే.. చిక్నా గ్రామానికి చెందిన మృతుడు రాజ కుమార్ ఢిల్లీలోని ఒక హోటల్‌లో పని చేసేవాడు.. డెలివరీ చేయడానికి తరచుగా తన స్నేహితుడి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలోనే రీనా దేవికి దగ్గరయ్యాడు. దీంతో వీరి మధ్య ఏర్పడిన బంధం కాస్త ప్రేమగా మారింది.
Read Also: Iran-US: ముసురుతున్న యుద్ధ వాతావరణం.. అవసరమైతే అణ్వాయుధాలు ప్రయోగిస్తామన్న ఇరాన్
అయితే, వారం రోజుల క్రితం రాజ కుమార్ రీనా దేవి ఇంటికి వెళ్లాడు. అతడు వెళ్లడాన్ని ఆమె కుటుంబ సభ్యులు గుర్తించి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కోపంతో ఉన్న రీనా కుటుంబ సభ్యులు రాజను తీవ్రంగా కొట్టారు. దీంతో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. విషమ పరిస్థితిలో ఉన్న అతడ్ని ఆస్పత్రికి తరలించే క్రమంలో మరణించాడు. అయితే, ఈ సంఘటన తర్వాత రాజా తండ్రి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులుగా రీనా దేవి, ఆమె భర్త జగదీష్ రాయ్, రీనా అల్లుడు రాజీవ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు బంధువులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.