ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన బెంగళూరు టెక్కీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్‌గఢ్‌క చెందిన శుభాన్షు శుక్లా బెంళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో సాప్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో ఉంటున్నాడు. భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న సమయంలో మే 9న హాస్టల్ బాల్కనీ నుంచి పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేశాడు. ఇలా మూడు సార్లు నినాదాలు చేశాడు. మే 9న అర్థరాత్రి 12:30 గంటల సమయంలో వైట్‌ఫీల్డ్‌లోని ప్రశాంత్ లేఅవుట్‌లో జరిగింది. అదే సమయంలో సమీపంలో ఉన్న నివాసి మొబైల్‌లో రికార్డ్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.
ఇది కూడా చదవండి: P.G. Vinda: మరోసారి తెలుగు సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.జి. విందా
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మొబైల్‌లోని రికార్డైన నినాదాలు పరిశీలించారు. వీడియోలో చివరి నినాదం రికార్డైంది. దీంతో భారత సార్వభౌమత్వాన్ని బెదిరించే చర్యలు (సెక్షన్ 152), జాతీయ ఐక్యతకు వ్యతిరేకంగా చేసిన ప్రకటనలు (సెక్షన్ 197(1)(d)), మరియు ప్రజా అశాంతికి కారణమయ్యే ప్రకటనలు (సెక్షన్ 353(1)) కింద అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Pulwama encounter: దయచేసి లొంగిపో.. ఉగ్రవాదితో తల్లి పలికిన మాటలు వైరల్
శుక్లాను అదుపులోకి తీసుకుని విచారించగా ఉద్వేగంతోనే నినాదాలు చేశానని.. ఎటువంటి హాని కలిగించాలనే ఉద్దేశంతో చేయలేదని చెప్పాడు. వీడియోను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించారు. అలాగే అతడి వాయిస్ నమూనాను తీసుకున్నారు. ఆ సమయంలో మద్యం లేదా మాదకద్రవ్యాలు తీసుకున్నాడా? అని నిర్ధారించడానికి రక్తనమూనాను తీసుకున్నారు. ప్రస్తుతం శుక్లా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.