Indian Army: జమ్మూ కాశ్మీర్‌లోకి విదేశీ ఉగ్రవాదులను పంపించేందుకు పాకిస్తాన్ ప్రయత్నిస్తోందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. రాజౌరీ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఐదుగురు ఆర్మీ అధికారులకు ఉత్తర ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది శుక్రవారం శ్రద్ధాంజలి ఘటించారు. గత రెండు రోజులుగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరేతోయిబా టాప్ కమాండర్ కారీతో పాటు మరో ఉగ్రవాదిని భద్రతాబలగాలు హతమార్చాయి.
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. రాజౌరి జిల్లాలోని బాజీ మాల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులకు, ఆర్మీకి మధ్య భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఉగ్రవాదులను తుదముట్టించే క్రమంలో కెప్టెన్ ర్యాంక్ ఉన్న ఒక ఆర్మీ అధికారితో పాటు ఒక సైనికుడు వీరమరణం పొందారు. మరో ఇద్దరు సైనికులు గాయపడినట్లు సమాచారం.
Rajouri terror attack: జమ్మూ కాశ్మీర్ లో ఏడు నుంచి తొమ్మిది మంది ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతాబలగాలు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టాయి. హెలికాప్టర్లు, డ్రోన్లతో సరిహద్దుల్లోని అడవులను స్కాన్ చేస్తున్నాయి. శుక్రవారం జరిగిన రాజౌరీ ఎన్ కౌంటర్ లో ఐదుగురు జవాన్లు మరణించడంతో ప్రతీకారం తీర్చుకునేందుకు సైన్యం ఉగ్రవాదుల కోసం వెతుకుతోంది. ఇప్పటికే రాజౌరీతో పాటు బారాముల్లాలో ఎన్ కౌంటర్లు జరుగుతున్నాయి.
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దర్హల్ ప్రాంతంలోని పర్గల్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు యత్నించారు.