Amit Shah: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 30కి పైగా మావోయిస్టులు హతమయ్యారు. ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎన్‌కౌంటర్ ఇదే అని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉంటే, ఈ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక భేటీకి పిలుపునిచ్చారు.
Read Also: Shimla mosque Row: సంజౌలి మసీదు మూడు అంతస్తులు కూల్చేయాలని కోర్టు ఆదేశం..
సోమవారం వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో కీలక సమావేశం జరగబోతోంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగబోయే ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి సహాయాన్ని అందించే ఐదు కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, కేంద్ర-రాష్ట్రాల సెంట్రల్ ఆర్డ్మ్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) సీనియర్ అధికారులు కూడా సమావేశంలో పాల్గొంటారని కేంద్ర హోం వ్యవహరాల మంత్రిత్వ శాఖ తెలిపింది.