Maoist Leader: ఆయుధాలు వదులుకున్న 208 మంది మావోయిస్టులు నేడు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ ముందు అధికారికంగా లొంగిపోయారు. ఈ తాజాగా బృందం దేశంలోని అనేక ప్రాంతాల్లో చురుగ్గా మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగించింది. లొంగిపోయిన వారిలో అనేక మంది సీనియర్ క్యాడర్లు ఉండటం విశేషం. మావోయిస్టు అగ్రనేత ఆశన్న ప్రముఖుడు. అయితే.. 59 ఏళ్ల తక్కలపల్లి వాసుదేవరావు (ఆశన్న ) బాంబులు తయారు చేసేవాడట. ఛత్తీస్‌గఢ్‌లోని అబుజ్మద్‌లో చురుకుగా పని చేశారని చెబుతారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్…
Posters : ములుగు జిల్లా కన్నాయిగుడెం మండలంలోని గుత్తికొయ గూడాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా అనూహ్యంగా వాల్ పోస్టర్లు కనిపించి స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ‘ప్రజా ఫ్రంట్’ పేరిట వెలుసిన ఈ పోస్టర్లు మావోయిస్టుల తీరుపై విమర్శలు గుప్పిస్తూ, వారికి మార్గదర్శనం చేసేలా ఉన్నాయి. ఈ పోస్టర్లలో మావోయిస్టు సిద్ధాంతాన్ని సూటిగా ప్రశ్నిస్తూ – “సిద్ధాంతం కోసం అడవిలోకి వెళ్లిన అన్నల్లారా, అక్కల్లారా… మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యుడికి ఎప్పుడైనా ఆశాకిరణంగా మారిందా?” అని ప్రశ్నించారు. అంతేగాక, నాలుగు…
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం నక్సలైట్లు ముగ్గురు గ్రామస్థులను చంపేశారు. బాధితులను తాళ్లతో గొంతు కోసి దారుణంగా చంపారు. ఈ దాడి స్థానికుల్లో భయాన్ని వ్యాప్తి చేయడానికి నక్సలైట్లు చేసిన ప్రయత్నంగా కనిపిస్తోందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వామపక్ష తీవ్రవాదానికి కేంద్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలించడంలో భద్రతా దళాలు గణనీయమైన విజయాలు సాధిస్తున్నాయి. ఈ తరుణంలో ఇలాంటి దాడి జరగడం గమనార్హం .
Maoists : తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 20న బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ ఈ బంద్‌ను ప్రకటించినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ప్రకటనలో ప్రకారం, జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగిన ఆపరేషన్ కగార్ పేరుతో నేషనల్ పార్క్ పరిధిలో చేపట్టిన దాడుల్లో రాష్ట్ర స్థాయి కీలక నాయకులైన కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, కామ్రేడ్…
వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యమని కేంద్రం పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆపరేషన్ కగార్‌ను ప్రారంభించింది. ఇది గతేడాది నుంచి ఆపరేషన్ ఊపందుకుంది.
ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాను నక్సల్ ప్రభావిత ప్రాంతాల జాబితా (LWE - లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం) నుంచి తొలగిస్తూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇది ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రానికి, ముఖ్యంగా బస్తర్‌కు ఒక చారిత్రాత్మక విజయంగా పరిగణించబడుతుంది. గత కొన్ని ఏళ్లుగా భద్రతా దళాలు, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజల ఉమ్మడి ప్రయత్నాల కారణంగా బస్తర్‌లో నక్సలైట్ల ఏరివేత సమర్థవంతంగా ముగిసింది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం శాంతి పునరుద్ధరించబడింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ సరిహదుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. తాజాగా భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ నక్సలైట్లు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులు హతమయ్యారు. అందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, మావోయిస్టు ఎస్‌జెడ్‌సీఎం బండి ప్రకాశ్ ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రన్న తలపై ఇప్పటికే రూ.కోటి రివార్డు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇంకా ఉసూర్ ప్రాంతంలోని లంకపల్లె అడవుల్లో కాల్పులు కొనసాగుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసులు నిర్ణయించారు.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు. దీంతో పోలీసులు స్పేషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యులు…