Ayodhya Deepotsav: దీపావళి వేడుకల్లో భాగంగా అయోధ్యలో జరిగిన ‘దీపోత్సవం’ ప్రపంచ రికార్డును సృష్టించింది. ఒకేసారి 22 లక్షల దీపాలను వెలిగించారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో జరిగిన దీపోత్సవాన్ని ‘అద్భుతమైనది, దైవికమైనది, మరుపురానిది’గా ఆదివారం కొనియాడారు. ఈ వేడులకు సంబంధించిన చిత్రాలను పంచుకున్నారు.
ప్రధాని తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) అకౌంట్లో.. ‘‘అయోధ్యలో వెలిగించిన మిలియన్ల దీపాలతో దేశం మొత్తం ప్రకాశవంతంగా ఉందని అన్నారు. దీని నుంచి వెలువడే శక్తి భారతదేశమంతటా కొత్త ఉత్సాహాన్ని వ్యాపింపజేస్తోంది. శ్రీరాముడు దేశ ప్రజలందరికీ మేలు చేయాలని, నా కుటుంబ సభ్యులందరికీ స్పూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను. జై సియారాం’’ హిందీలో ట్వీట్ చేశారు.
Read Also: Diwali Safety Tips: దీపావళి రోజున పటాసులు పేల్చేటప్పుడు ఈ తప్పులు చేయకండి..
అయోధ్యలో శనివారం ఘనంగా ‘దీపోత్సవం’ వేడుక జరిగింది. లక్షల మట్టి దీపాలను వెలిగించారు. అంతకుముందు అయోధ్య పేరిట ఉన్న తన రికార్డును తానే బద్ధలు కొట్టింది. అయోధ్యలోని సరయూ నది ఒడ్డున ఉన్న 51 ఘాట్‌లలో 22.23 లక్షల దీపాలను వెలిగించి కొత్తగా గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయోధ్యలో దీపోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ సంవత్సరం సుమారు 51,000 దీపాలను వెలిగించారు. 2019లో వాటి సంఖ్య 4.10 లక్షలకు చేరింది. 2020లో 6 లక్షలు , 2021లో 9 లక్షల దీపాలను వెలిగించారు. 2022లో రామ్ కి పూరీ ఘాట్ లో 17 లక్షల దీపాలను వెలగించి గిన్నస్ బుక్ ఆఫ్ రికార్డ్ సృష్టించింది.
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న సమయంలో ఈ దీపోత్సవం ప్రత్యేకంగా నిలిచింది. వచ్చే ఏడాది జనవరిలో భవ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. జనవరి 22, 2024లో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పండగలా జరగబోతోంది. దీనికి ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నారు.
अद्भुत, अलौकिक और अविस्मरणीय!
लाखों दीयों से जगमग अयोध्या नगरी के भव्य दीपोत्सव से सारा देश प्रकाशमान हो रहा है। इससे निकली ऊर्जा संपूर्ण भारतवर्ष में नई उमंग और नए उत्साह का संचार कर रही है। मेरी कामना है कि भगवान श्री राम समस्त देशवासियों का कल्याण करें और मेरे सभी… pic.twitter.com/3dehLH45Tp
— Narendra Modi (@narendramodi) November 12, 2023