Jaishankar: యూరప్ అహంకారంపై భారత్ దెబ్బ.. జైశంకర్ సమాధానంతో సైలెంట్..
- రష్యన్ ఆయిల్‌పై జైశంకర్ సమాధానం..
- యూరప్‌కు మరోసారి భంగపాటు..
- గెలికి మరీ తన్నించుకున్న యూరప్ జర్నలిస్టులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar: భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పరువు తీయించుకోవడం యూరప్ జర్నలిస్టులు, యూరప్ నేతలకు అలవాటుగా మారింది. గెలికి మరీ తన్నించుకోవడం అంటే వారికి సరదాగా ఉంటుంది కావచ్చు. భారత్ ఒకప్పటి భారత్ కాదని ఇంకా యూరప్ దేశాలు, నాయకులు గుర్తించలేకపోతున్నారు. టాప్-5లో ఒక ఆర్థిక వ్యవస్థ అని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అని గుర్తించలేకపోతున్నారు. తమ పైత్యాన్ని జైశంకర్ ముందు చూపించాలని ప్రయత్నించి మరోసారి భంగపడ్డారు.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడాన్ని ప్రశ్నించిన యూరప్ దేశాలకు గట్టి సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్న అడిగే నైతిక హక్కు యూరప్ దేశాలకు లేదని స్పష్టం చేశారు. యూరప్‌లో తయారైన ఆయుధాలను భారత్‌పై దాడులకు ఉపయోగించారని, కానీ భారత్ ఆయుధాలు ఎప్పుడూ యూరప్ లోని ఏ దేశానికి ముప్పుగా మారలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఫిన్లాండ్లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ ‘‘ ఎమర్జింగ్ పవర్స్ అండ్ ది జియోపాలిటికల్ కాంపిటీషన్’’ అనే అంశంపై మాట్లాడారు.
Also Read
- Congress: "అఖండ కాంగ్రెస్".. విలీనం దిశగా టీఎంసీ, ఎన్సీపీ..
- Charu Pandey: కోచింగ్ లేదు.. బుక్స్ పట్టుకుని కూర్చోలేదు! కానీ 19 గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు!
- Mamata Banerjee: మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్.. మత విద్వేష వ్యాఖ్యలే కారణం..
- Kolkata: ప్రభుత్వ కార్యాలయంలో అగ్నిప్రమాదం.. 4 వేల ఈవీఎంలు దగ్ధం.. రాజకీయంగా కలకలం
ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యా ముడి చమురును కొనుగోలు చేయాలన్న భారతదేశ నిర్ణయం, దాని అందుబాటు ధర, లభ్యతపై ఆధారపడి ఉందని అన్నారు. ప్రపంచ మార్కెట్లను స్థిరీకరించడంలో సహాయపడటానికి, 2022లో కొనుగోళ్లను కొనసాగించమని అమెరికానే భారతదేశాన్ని ప్రోత్సహించిందని ఆయన తెలిపారు. రష్యా పట్ల భారత్‌కు మితిమీరిన సానుభూతితో ఎందుకు ఉందని ఒక విలేకరి ప్రశ్నించడంతో జైశంకర్ ఇలా ఘాటుగా బదులిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత దేశ సంప్రదాయ సరఫరాదారులైన మిడిల్ ఈస్ట్ నుంచి యూరప్ చమురు కొనుగోలు ప్రారంభించడంతో, భారత్ రష్యా చమురు వైపు మొగ్గు చూపిందని పేర్కొన్నారు. ఈ సమాధానంలో యూరప్ అహంకారంపై మరోసారి జైశంకర్ దెబ్బకొట్టారు.
యూరప్‌పై విమర్శలు చేస్తూ.. దశాబ్ధాలుగా యూరప్ తయారీ ఆయుధాలను భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించారని, భారత్ మాత్రం ఎన్నడూ కూడా యూరప్ భద్రతకు ప్రమాదంగా మారలేదనే విషయాన్ని గుర్తుచేశారు. పాకిస్తాన్ సైన్యంలో ఉన్న జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ వంటి యూరప్ దేశాల ఆయుధాలను, యుద్ధ విమానాలు, జలంతార్గాముల్ని జైశంకర్ పరోక్షంగా ఎత్తిచూపారు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యన్ ఆయిల్ కొనుగోలును జైశంకర్ సమర్ధిస్తున్నారు.
తాజావార్తలు
-
Jaishankar: యూరప్ అహంకారంపై భారత్ దెబ్బ.. జైశంకర్ సమాధానంతో సైలెంట్..
-
Iran-US: హమ్మయ్య.. అమెరికాతో ఒప్పందానికి లైన్‌క్లియర్!.. ఇరాన్ కీలక ప్రకటన
-
Congress: “అఖండ కాంగ్రెస్”.. విలీనం దిశగా టీఎంసీ, ఎన్సీపీ..
-
Charu Pandey: కోచింగ్ లేదు.. బుక్స్ పట్టుకుని కూర్చోలేదు! కానీ 19 గవర్నమెంట్ జాబ్స్ కొట్టింది.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్.. మత విద్వేష వ్యాఖ్యలే కారణం..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!