Afghanistan: భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు నెమ్మదిగా బలపడుతున్నాయి. ఇటీవల, ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో కొన్ని రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి. అయితే, ఈ పరిణామాలను పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోయింది. భారత్ పర్యటను ముత్తాఖీ వచ్చిన రోజే కాబూల్‌పై వైమానికి దాడికి తెగబడింది.
India-Afghanistan: భారతదేశంలో, ఆఫ్ఘానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ పర్యటిస్తున్నారు. తాలిబాన్లు 2021లో ఆఫ్ఘాన్ అధికారాన్ని చేపట్టిన తర్వాత, భారత్‌లో ఒక తాలిబాన్ మంత్రి పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక రాజకీయాల కారణంగా ఆఫ్ఘాన్‌తో సత్సంబంధాలు భారత్‌కు ఇప్పుడు కీలకం.
K.A. Paul: యెమెన్లో మరణశిక్ష నుంచి తప్పించుకున్న కేరళ నర్సు నిమిష ప్రియ గురించి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచల వ్యాఖ్యలు చేశారు. యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిష ప్రియ జూలై 16న చనిపోవాల్సింది. జూలై 14 న సుప్రీం కోర్టులో నిమిషను కాపాడలేక పోయాం అని కేంద్రం చెప్పింది. కానీ మొత్తానికి ఆమెను మరణ శిక్ష నుంచి తప్పించాం. కానీ నాకు పేరు ప్రఖ్యాతలు వస్తాయని కొన్ని శక్తులు ఆమె విడుదలను ఆపించారని…
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ తన ఐదు దేశాల పర్యటనలో భాగంగా, బుధవారం ఆఫ్రికా దేశమైన నమీబియాలో పర్యటిస్తున్నారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఆ దేశానికి వెళ్తున్న తొలి భారత ప్రధానిగా మోడీ రికార్డుకెక్కారు. ఇప్పటివరకు ఈ దేశానికి మోడీతో కలిపి ముగ్గురు భారత ప్రధానులు మాత్రమే వెళ్లారు. ప్రధానికి నమీబియా దేశ అత్యున్నత పురస్కారమైన ‘‘‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ ప్రదానం చేసింది.
భారతదేశం మరోసారి విదేశీ గడ్డపై తన దౌత్య మాయాజాలాన్ని ప్రదర్శించింది. భారత పౌరుల కోసం ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. దీంతో భారత్ తమ పౌరులను స్వదేశానికి తిరిగి తెచ్చేందుకు సన్నాహాలు చేసింది. ఇందులో భాగంగా ఇరాన్ భారతీయ విద్యార్థుల కోసం టెహ్రాన్ తన గగనతలాన్ని తెరిచింది.
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రతరం చేయాలనే ఉద్దేశ్యం భారతదేశానికి లేదని.. కానీ మా దేశంపై సైనిక దాడులు జరిపితే.. గట్టి సమాధానం ఇస్తామని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చితో జరిగిన సమావేశంలో జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రికెట్ లాగానే భారత విదేశాంగ విధానం కూడా ఉందన్నారు. పాక్ విషయంలో మారిన భారత వైఖరిని క్రికెట్‌తో పోల్చారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను మరోసారి భారత్‌పై మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ అనుసరిస్తున్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనియాడారు. దేశ ప్రజల కోసం రష్యా నుంచి ధైర్యంగా చమురును కొనుగోలు చేస్తోందన్నారు.