RajyaSabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ దుమారం..
- ‘‘లుంగీ వాలా’’ వ్యాఖ్యపై రాజ్యసభలో రచ్చ..
- బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ అన్నారని సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఆరోపణ..
- తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని సుస్మితా వివరణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajya Sabha: రాజ్యసభలో ‘‘లుంగీ వాలా’’ వాఖ్యలు తీవ్ర వివాదానికి కారణమయ్యాయి. సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌ను బీజేపీ ఎంపీ సుస్మితా దేవ్ ‘‘లుంగీ వాలా’’ అని పిలిచారని ఆరోపించడంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. అయితే, తాను ఈ పదాన్ని ఉపయోగించలేదని సుస్మితా దేవ్ స్పష్టం చేశారు. సోమవారం సభలో ఆదాయపు పన్ను సవరణ ఆర్డినెన్స్‌పై చర్చ సందర్భంగా తాను మాట్లాడుతున్నప్పుడు సుస్మితా పలుమార్లు లుంగీవాలా అని పిలిచారని బ్రిట్టాస్ ఆరోపించారు. తాను మలయాళీగా, దక్షిణ భారతీయుడిగా గర్విస్తున్నానని, భారత సంస్కృతిలోని దుస్తులను అవమానకరంగా చూడటం మంచిది కాదని ఆయన అన్నారు.
బ్రిట్టాస్ ఆరోపణలను సుస్మితా ఖండించారు. తాను ఏ రాష్ట్రానికి చెందిన దుస్తుల్ని అవమానించలేదని రాజ్యసభలో వివరణ ఇచ్చారు. తాను అస్సాంకు చెందిన బెంగాలీని అని, వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన సంప్రదాయ దుస్తులు ధరించడం తాను చూశానని, లుంగీవాలా అనే పదాన్ని తాను ఉపయోగించలేదని, విచారన జరిగితే వాస్తవం బయటపడుతుందని అన్నారు. బ్రిట్టాస్ తప్పుడు ఆరోపణలు చేశారని, అతడిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. సంస్కృతి లేదా మతం ఆధారంగా భారతదేశాన్ని విభజించాలని ఒక సభ్యుడు కోరుకుంటున్నారనే సందేశాన్ని రాజ్యసభ పంపకూడదని ఆమె పేర్కొన్నారు.
Also Read
ఈ వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దక్షిణ భారత సంస్కృతి, ప్రాంతీయ గుర్తింపును అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. దుస్తులు, ఆహారం, రంగు వంటి అంశాలను రాజకీయ విభేదాలకు ఉపయోగించడం దేశంలోని ‘భిన్నత్వంలో ఏకత్వం’ స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఈ వివాదంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా కూడా స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు సమర్థనీయొం కాదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. సభ గౌరవాన్ని కాపాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇరువురు ఎంపీలు తన ఛాంబర్‌కు పిలిచిన రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్, వివాదాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!