Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Cricketers Who Married Older Women: భారత క్రికెట్లో రికార్డులు సృష్టించడం, తుడిచిపెట్టుకుపోవడం సర్వసాధారణం. అయితే మైదానంలో బౌండరీల వర్షం కురిపించే క్రికెటర్లు, తమ వ్యక్తిగత జీవితాల్లో తీసుకున్న నిర్ణయాల్లోనూ ప్రత్యేకంగా నిలిచారు. సాధారణంగా సమాజంలో భార్య కంటే భర్త వయస్సు ఎక్కువగా ఉండాలనే నమ్మకం ఉంది. కానీ భారత క్రికెట్ దిగ్గజాలు కొందరు ఈ సాంప్రదాయ ఆలోచనలను, సామాజిక కట్టుబాట్లను పక్కనపెట్టి, మనసుకు నచ్చిన బంధానికే ప్రాధాన్యత ఇచ్చారు. తమ కంటే వయస్సులో పెద్దవారైన మహిళలను భాగస్వాములుగా ఎంచుకుని ఆదర్శంగా నిలిచారు.
సచిన్-అంజలి
ఈ జాబితాలో మొదటిగా చెప్పుకోవాల్సింది క్రికెట్ దేవుడిగా కొనియాడబడే సచిన్ టెండూల్కర్ గురించి. 17 ఏళ్ల వయస్సులో ముంబై విమానాశ్రయంలో డాక్టర్ అంజలి మెహతాతో సచిన్ మొదటి పరిచయం ఏర్పడింది. అది కాస్తా కాలక్రమేణా ప్రేమగా మారింది. అంజలి, సచిన్ కంటే 6 ఏళ్లు పెద్ద కావడం గమనార్హం. వీరిద్దరూ మే 24, 1995న వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ దంపతులకు సారా, అర్జున్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read
- Diwali Firecracker Smoke: బాణసంచా పొగతో తలనొప్పి వస్తోందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
- ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
- Anshul Kamboj: అతని బౌలింగ్ నిజంగా అద్భుతం.. అరుదైన క్లబ్లో చోటు..!
- CM Chandrababu Aerial Survey: మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ వ్యూ..
వెంకటేష్ ప్రసాద్-జయంతి
మాజీ వేగవంతమైన బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. భార్య జయంతి, ఆయన కంటే 9 ఏళ్లు పెద్దది కాగా, అంతకుముందే వివాహబంధం నుంచి వేరుపడిన మహిళ. అనిల్ కుంబ్లే ద్వారా వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. వెంకటేష్ ప్రసాద్‌ను జయంతి ముందే ప్రోపోజ్ చేయగా, 1996లో వీరి పెళ్లి జరిగింది. వీరికి పృథ్వి అనే కుమారుడు ఉన్నాడు.
అనిల్ కుంబ్లే- చేతన
లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే జీవితం కూడా ప్రేమకు నిదర్శనం. అప్పట్లో కష్టకాలంలో ఉండి, తన కుమార్తె కస్టడీ కోసం న్యాయపోరాటం చేస్తున్న చేతన రామతీర్థను కుంబ్లే పెళ్లాడారు. చేతన, కుంబ్లే కంటే 2 ఏళ్లు పెద్దది. ఆమె కుమార్తెకు తన పేరును ఇవ్వడమే కాకుండా, పెళ్లి తర్వాత వీరికి మరో ఇద్దరు పిల్లలు జన్మించారు.
రాబిన్ ఉతప్ప- శీతల్ గౌతమ్
మాజీ బ్యాటర్ రాబిన్ ఉతప్ప కూడా తన కాలేజీ సీనియర్, టెన్నిస్ క్రీడాకారిణి శీతల్ గౌతమ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. శీతల్, రాబిన్ కంటే 4 ఏళ్లు పెద్దది. ఏడేళ్ల డేటింగ్ తర్వాత మార్చి 2016లో వీరు వివాహం చేసుకున్నారు. క్రైస్తవ, హిందూ సాంప్రదాయాల ప్రకారం రెండుసార్లు వీరి పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బుమ్రా, శిఖర్ ధావన్, మహమ్మద్ షమీ
ఇక యార్కర్ కింగ్ జస్ప్రీత్ బుమ్రా, స్పోర్ట్స్ యాంకర్ సంజనా గణేశన్‌ను 2021లో వివాహం చేసుకున్నారు. సంజన, బుమ్రా కంటే దాదాపు 2 ఏళ్ల 7 నెలలు పెద్దది. ఈ జంట అభిమానుల్లో ఎంతో ఆదరణ పొందింది. అయితే, వయస్సులో పెద్దవారైన భాగస్వాములను ఎంచుకున్న కొన్ని బంధాలలో హెచ్చుతగ్గులు కూడా ఎదురయ్యాయి. ఓపెనర్ శిఖర్ ధావన్ తన కంటే 10 ఏళ్లు పెద్దదైన ఆయేషా ముఖర్జీని 2012లో పెళ్లాడారు. వీరికి జోరావర్ అనే కుమారుడు ఉన్నప్పటికీ, విభేదాల కారణంగా విడిపోయారు. అలాగే, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ 2014లో కేకేఆర్ మాజీ చీర్ లీడర్ హసీన్ జహాన్‌ను వివాహం చేసుకున్నారు. హసీన్ జహాన్ కూడా షమీ కంటే 10 ఏళ్లు పెద్దది కాగా, 2018లో వచ్చిన కుటుంబ వివాదాల వల్ల వీరిద్దరూ వేరుపడ్డారు.
తాజావార్తలు
-
Imran Khan: ‘నా భార్యను కాపాడండి.. నా కేసు తర్వాత చూద్దాం’ లాయర్లకు ఇమ్రాన్ ఖాన్ రిక్వెస్ట్!
-
Narakasura Story : దీపావళి వెనుక పురాణ గాథ.. తెల్లవారుజామునే నూనె స్నానం ఇందుకే..!
-
Fake Call Centre Scam: అమెరికా పౌరులను మోసం చేస్తున్న భారీ ఫేక్ కాల్ సెంటర్ రాకెట్ గుట్టురట్టు..
-
Archana Jois: KGFలో రాఖీ తల్లిగా కన్నీళ్లు పెట్టించి, ఇప్పుడు తెలుగులో గ్లామరస్ హీరోయిన్గా ఎంట్రీ
-
Ramayana : రామాయణ’కి దిల్ రాజు రివ్యూ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..