A Woman Or Girl Is Killed Every 11 Minutes By Intimate Partner Or Family Member: ఢిల్లీలో శ్రద్దావాకర్ దారుణ హత్య కేసు దేశం వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అత్యంత దారుణంగా మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి చంపాడు. ఈ హత్య విచారణ జరుగుతున్న సమయంలో ఐక్యరాజ్యసమితి చీఫ్ అంటోనియో గుటెర్రస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతీ 11 నిమిషాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళ లేదా బాలికను హత్య చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. వారి భాగస్వామి, కుటుంబ సభ్యుల చేతిలో హత్యకు గురువుతున్నట్లు ఆయన అన్నారు. ఇది మానవహక్కుల ఉల్లంఘన అని ఆయన అన్నారు. నవంబర్ 25న జరుపుకునే ‘ మహిళలపై హింస నిర్మూలన’ అంతర్జాతీయ దినోత్సవం ముందర యూఎన్ సెక్రటరీ జనరల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Saudi Arabia: 12 మంది తల నరికి, ఉరితీసిన సౌదీ అరేబియా
మహిళలు, బాలికలపై హింస అనేది ప్రపంచంలో అత్యంత విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘన అని ఆయన అన్నారు. కోవిడ్ 19 తర్వాత మనకు ఎదురువుతున్న ఒత్తిళ్ల గురించి తెలుసని.. ఆర్థిక సంక్షోభం, అనివార్యంగా మహిళలపై శారీరక, మౌళికంగా దాడి జరుగుతోందని ఆయన అన్నారు. స్త్రీలు, బాలికలు ద్వేషపూరిత ప్రసంగాలు, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇవన్నీ వారి ప్రాథమిక హక్కులను, స్వేచ్ఛను హరిస్తున్నాయని అన్నారు. ప్రపంచానికి కావల్సిన ఆర్థిక సమానత్వం, స్థిరమైన వృద్ధిని అడ్డుకుంటుందని అన్నారు.
2026 నాటికి మహిళ హక్కుల సంస్థలకు, ఉద్యమాలకు 50 శాతం నిధులను పెంచాలని ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. మహిళా హక్కులకు మద్దతుగా నిలవాలని, పురుషాధిక్యతను తిరస్కరించే విధంగా మనం అంతా మద్దతు ఇవ్వాలని.. గర్వంగా మనమంతా స్త్రీవాదులం అని ప్రకటించాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ దినోత్సవం థీమ్ ‘ యునైట్: మహిళలు, బాలికపై హింసను అంతచేయాడానికి క్రియశీలం కావాలి’ అని గుటెర్రస్ పేర్కొన్నారు.