Saudi Arabia beheads people by sword, executes 12 people in 10 days: అరబ్ దేశాల్లో నేరాలకు శిక్షలు ఎంత దారుణంగా ఉంటాయో అందరికి తెలిసిందే. అక్కడ నేరం చేయాలంటే, తన జీవితంపై ఆశ వదిలేసుకోవాల్సిందే. సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఇరాన్, ఇరాక్ దేశాల్లో నేరస్తులకు దారుణ శిక్షలు ఉంటాయి. బహిరంగంగా తలలు నరకడం, క్రేన్లకు కట్టి ఉరితీయడం అక్కడ సాధారణం. మాదకద్రవ్యాల రవాణా, అక్రమ సంబంధాలు, దొంగతనాలు, హత్యలకు దారుణంగా శిక్షిస్తుంది.
Read Also: Fifa World Cup: జర్నలిస్ట్‌కి చేదు అనుభవం.. లైవ్‌లోనే దోచుకున్న దొంగ
ఇదిలా ఉంటే సౌదీ అరేబియా గత 10 రోజుల్లో 12 మందికి మరణశిక్షలు విధించింది. ఇందులో చాలా మందిని కత్తితో తలనరికి శిక్ష విధించింది. మరికొంత మందికి ఉరిశిక్ష అమలు చేసింది. డ్రగ్స్ రవాణాకు పాల్పడిని 12 మందికిి పదిరోజుల్లో శిక్షలు విధించినట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు. సౌదీ ఈ ఏడాది మార్చిలో ఒకే రోజు 81 మంది దోషులకు ఉరిశిక్ష అమలు చేసింది. డ్రగ్స్ రవాణాకు పాల్పడిన జైలులో శిక్ష అనుభవిస్తున్నవారికి మరణ శిక్ష విధించింది. దోషుల్లో ఎక్కువ మంది విదేశీయులే ఉన్నారు. ముగ్గురు పాకిస్తాన్ దేశానికి చెందిన వారు కాగా.. ఇద్దరు జోర్డాన్, ముగ్గురు సౌదీ, నలుగురు సిరియా దేశానికి చెందిన వారు.
ఈ ఏడాది మార్చి నెలలో సౌదీ అరేబియా చరిత్రలోనే ఒకే రోజు ఎక్కువ మందికి సామూహిక ఉరిశిక్షలను విధించింది. హత్యలు, మిలిటెంట్ గ్రూపులకు చెందిన అనేక నేరాలకు పాల్పడిన 81 మందిని ఉరితీసింది. ఇటువంటి శిక్షలు తగ్గిస్తామని రెండేళ్ల క్రితం ప్రమాణం చేసి సౌదీ అరేబియా, సామూహిక ఉరిశిక్షలను అమలు చేస్తోంది. క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాల మేరకు సౌదీ డెత్ స్వ్కాడ్ 2018లో టర్కీలో యూఎస్ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గిని హత్య చేసిన నేపథ్యంలోొ ఈ ప్రకటన చేసింది. మరణశిక్షలను తగ్గించడానికి ప్రయత్నించింది. అయితే హత్యలకు పాల్పడుతున్న వారికి మాత్రమే మరణశిక్షలు విధిస్తోంది.