బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులో అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) సంచలన తీర్పు ఇచ్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న కేసులో షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. బంగ్లాదేశ్‌లో గత సంవత్సరం జరిగిన విద్యార్థుల నిరసనలపై జరిగిన హింసాత్మక అణచివేత, సంబంధిత మానవ హక్కుల ఉల్లంఘనలపై తాజా తీర్పుపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం (OHCHR) మరోసారి షేక్ హసీనా…
పాలస్తీనా దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. గాజా శాంతి ఒప్పందానికి సంబంధించిన తీర్మానంపై సోమవారం ఐక్యరాజ్యసమితిలో అమెరికా ఓటు వేయనుంది. అమెరికాతో పాటు ఈజిప్ట్, ముస్లిం దేశాలు మద్దతుగా ఓటు వేయనున్నాయి.
పాకిస్థాన్ వంచనను మరోసారి యూఎన్ వేదికగా భారత్ ఖండించింది. యూఎన్‌లో భారత దౌత్యవేత్త భావిక మనగలనందన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. పీఓకేలో పాకిస్థాన్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతుందని.. దీన్ని అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ద్వంద్వ మాటలు, కపటత్వాన్ని బయటపెట్టారు.
జమ్మూకాశ్మీర్ ఎల్లప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని ఐక్యరాజ్యసమితిలో భారతదేశ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ తెలిపారు. 80వ ఐక్యరాజ్యసమితి దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన బహిరంగ చర్చ సందర్భంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పర్వతనేని హరీష్ ప్రసంగిస్తూ పాకిస్థాన్‌పై ధ్వజమెత్తారు.
అంతర్జాతీయ వేదికగా భారతదేశంపై నిందలు మోపే ప్రయత్నం చేసిన దాయాది పాకిస్థాన్‌కు భారత దౌత్యవేత్త పర్వతనేని హరీష్ గట్టిగా బుద్ధి చెప్పారు. సొంత ప్రజలను బాంబులతో చంపే దేశం.. తమపై నిందలు వేయడం చాలా విడ్డూరంగా ఉందంటూ తిప్పికొట్టారు.
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగాన్ని భారత్ తిప్పికొట్టింది. భారత్ దౌత్యవేత్త పెటల్ గహ్లోట్ మాట్లాడుతూ.. అణు బ్లాక్ మెయిల్ ముసుగులో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని ఏ మాత్రం అంగీకరించబోమని తేల్చి చెప్పారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికాకు వెళ్లారు. ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాల్లో శుక్రవారం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి అమెరికాకు చేరుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి.
ప్రస్తుత మానవ చరిత్రలో ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ నెలకొందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశంలో జెలెన్స్కీ ప్రసంగించారు. ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని.. ఈ తీరు మారాలని కోరారు.
ట్రంప్.. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు. ఈ హోదాలో చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. పక్కా నిఘా. ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటి భద్రత కలిగిన ట్రంప్‌కు ఐక్యరాజ్యసమితిలో మాత్రం చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
అమెరికాలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. న్యూయార్క్‌లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్యసమితి శిఖరాగ్ర సమావేశాలకు హాజరయ్యేందుకు మాక్రాన్ వెళ్లారు. అయితే అదే సమయంలో ట్రంప్ కాన్వాయ్ కూడా వస్తోంది. దేశ అధ్యక్షుడు కాబట్టి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యూయార్క్ రోడ్డుపై మాక్రాన్‌ను నిలిపివేశారు.