Dead Body in Parcel: చేసిందంతా చెల్లెలి భర్తే.. నిందితుడు చిక్కితే వీడనున్న చిక్కుముడులు!
- హోమ్ డెలివరీ డెడ్ బాడీ కేసు
- చేసిందంతా చెల్లెలి భర్తే
- నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో డిసెంబర్ 19న హోమ్ డెలివరీ అయిన డెడ్ బాడీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనకు ప్రధాన సూత్రధారి శ్రీధర్ వర్మ అని పోలీసులు భావిస్తున్నారు. పార్సిల్ అందుకున్న సాగి తులసి చెల్లెలి భర్తే ఈ శ్రీధర్ వర్మ. నిందితుడు చిక్కితే కేసులో చిక్కుముడులు వీడే అవకాశాలు ఉన్నాయి. కేసులు త్వరగా చేదించేందుకు ఉండి పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
నిందితులుగా భావిస్తున్న సుధీర్ వర్మ ఎప్పుడూ మొహానికి మాస్క్ పెట్టుకుని సంచరించేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఆటో డ్రైవర్‌కు పార్సెల్ అందించిన మహిళ ఎవరు? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. పిప్పర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ చెరుకువాడ సతీష్‌కి సాగిపాడు వద్ద మాస్క్ కట్టుకుని వచ్చిన మహిళ చెక్కపెట్టేతో ఉన్న పార్సెల్ అందించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
పార్సిల్ లో వచ్చిన డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తి చేసిన ప్రత్యేక వైద్య బృందం అది హత్యగా నిర్ధారించారు. ఐతే మృతుడి వివరాలు ఇప్పటివరకు తెలియలేదు. మృతుడి వివరాలు తెలిస్తే.. చెప్పాలంటూ పోలీసుల ప్రకటన కూడా విడుదల చేశారు. కేసు తీవ్రత దృష్ట్యా ఐజీ అశోక్ కుమార్ విచారణపై సమీక్షించారు. ఇప్పటివరకు దొరికిన ఆధారాలతో త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి అన్నారు.
Also Read: AP Rains: 4 రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన.. మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ!
ఈ నెల 19న యండగండిలో సాగి తులసి అనే మహిళకు అందిన పార్సెల్లో మృతదేహం చూసి.. పోలీసులకు కంప్లైంట్ చేశారు. పార్సిల్ అందిన నాటి నుంచి కనిపించకుండా పోయిన సాగి తులసి చెల్లెలి భర్త సిద్ధార్థ వర్మను నిందితుడిగా పోలీసులు భావిస్తున్నారు. కృష్ణా జిల్లా మల్లంపూడికి చెందిన తిరుమణ సుధీర్ వర్మకు మూడు పేర్లు ఉండగా.. ముగ్గురు భార్యలు ఉన్నారు. సుధీర్ వర్మగా మొదటి పెళ్లి. శ్రీధర్ వర్మగా రెండో పెళ్లి, సిద్ధార్థ వర్మగా మూడో పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. రెండో భార్య రేవతి అక్క తులసీతో ఆస్తి తగాదాలు ఉన్నాయి. అందుకే శ్రీధర్ వర్మను నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!