నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. చెవుల్లో ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని ఇద్దరు యువకులు రైల్వేట్రాక్‌పై సంగీతం వింటున్నారు. సంగీతంలో లీనమైపోయి.. కనీసం రైలు హారన్ కూడా వినిపించలేదు. దీంతో వేగంగా ట్రైన్ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దీనదయాళ్ పాండే సోమవారం తెలిపారు.
ఇది కూడా చదవండి: Cabinet Sub-Committee: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. రైతులందరికీ బీమా అమలు..
ఇద్దరు స్నేహితులు సమీర్ (15), జాకీర్ అహ్మద్ (16)గా గుర్తించారు. మృతులు రాజ్‌దేపూర్ నివాసితులు అని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దీనదయాళ్ పాండే తెలిపారు. ఆదివారం సాయంత్రం రైల్వే లైన్‌పై కుర్రాళ్లు కూర్చుని ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుని సంగీతం వింటూ ఉండగా ఈ ఘటన చోటుచేసుకుందని వెల్లడించారు. రైలు హారన్ శబ్దం వినిపించలేదని చెప్పారు. రైలు ఢీకొని అక్కడికక్కడే మరణించారని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తదుపరి విచారణ జరుగుతోందని పాండే వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Charlie Cassell: పెను సంచలనం.. మొదటి మ్యాచ్ లోనే 7 వికెట్లు తీసిన బౌలర్..