Charlie Cassell Did world record in his debut One day International Match: ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో జరుగుతున్న మ్యాచ్ ల సందర్భంగా ఓ బౌలర్ యావత్ ప్రపంచం దృష్టిని తనవైపుకు తిప్పుకున్నాడు. ఆ టోర్నీలోని 16వ మ్యాచ్ లో స్కాట్లాండ్ కు చెందిన ఓ ఫాస్ట్ బౌలర్ ఒమన్ తో అరంగేట్రం చేశాడు. ఈ అరంగేట్రం మ్యాచ్ ను ఇంత గొప్పగా ఉంటుందని ఆ బౌలర్ కూడా కల కని ఉండడు. కెరీర్‌లో తొలి మ్యాచ్ లోనే ఈ బౌలర్ ప్రపంచ రికార్డు సృష్టించి ఇంతకు ముందు ఎవరూ తీయని విధంగా అరంగేట్రంలోనే 7 వికెట్లు పడగొట్టాడు.
Diamond Necklace: చెత్త కుప్పలో దొరికిన డైమండ్ నెక్లెస్.. చివరకి?
ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్ తరఫున చార్లీ క్యాజిల్ అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్ లోనే అతను కనబరిచిన ఆటతీరు సంచలనంగా మారింది. 7 వికెట్లతో తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా మొదలు పెట్టాడు. తొలి బంతికే చార్లీ క్యాజిల్ వికెట్ తీశాడు. ఆ తర్వాత కూడా ఆగకుండా రెండో బంతికి కూడా వికెట్ తీశాడు. దీంతో అరంగేట్రం మ్యాచ్ లో తొలి రెండు బంతులతో రెండు వికెట్స్ తీసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇక అదే ఓవర్ నాలుగో బంతికి కూడా మరో వికెట్ కూడా తీశాడు. దాంతో చార్లీ కాజిల్ తన మొదటి ఓవర్లో మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఆ ఓవర్ లో ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు.
Viral Dance: ఢిల్లీ మెట్రోలో మరో కళాఖండం.. చూసారా..?
చార్లీ కాజిల్ తన మొదటి ఓవర్‌లోనే ప్రపంచ రికార్డు సృష్టించిన తర్వాత.. తన అద్భుతమైన ప్రదర్శనను కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో అతను మొత్తం 5.4 ఓవర్లు బౌలింగ్ చేసి 7 మంది బ్యాట్స్‌మెన్ లను పెవిలియన్ కు చేర్చాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఒక బౌలర్ తన అరంగేట్రం మ్యాచ్‌లో 7 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. అంతకుముందు ఇద్దరు బౌలర్లు తమ అరంగేట్రం మ్యాచ్‌లో 6 వికెట్లు తీశారు. చార్లీ కాజిల్ దెబ్బకు ఒమన్ జట్టు మొత్తం 21.4 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 91 పరుగులకు ఆలౌట్ అయింది. ఒమన్ తరఫున అత్యధికంగా ప్రతీక్ అథవాలే అత్యధికంగా 34 పరుగులు చేశాడు. స్కాట్లాండ్ తరఫున చార్లీ క్యాజిల్ 7 వికెట్లతో రెచ్చిపోగా.. బ్రాడ్ క్యూరీ, బ్రాండన్ మెక్‌ముల్లెన్, గావిన్ మెయిన్ చెరో వికెట్ తీశారు.
5️⃣.4️⃣ overs
1️⃣ maiden
2️⃣1️⃣ runs
7️⃣ wicketsCharlie Cassell with the 𝘽𝙀𝙎𝙏 𝙀𝙑𝙀𝙍 figures on ODI debut 🤯🤩🔥#FollowScotland pic.twitter.com/EXSw7ixucZ
— Cricket Scotland (@CricketScotland) July 22, 2024