గుజరాత్‌లో రెండు కుక్కలు, రెండు సింహాల మధ్య సూపర్ ఫైటింగ్ జరిగింది. ఇరువైపుల నుంచి పోరు తీవ్రంగానే జరిగింది. కానీ ఎలాంటి హానీ లేకుండానే ఫైటింగ్ ముగిసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గుజరాత్‌లోని ఆసియాటిక్ సింహాలకు ప్రసిద్ధి చెందిన గిర్ నేషనల్ పార్క్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్రేలిలోని సావర్‌కుండ్లాలోని ఓ గోశాల దగ్గరకు రెండు సింహాలు వచ్చాయి. గేట్లు వేసి ఉన్నాయి. అక్కడే కాపలాగా ఉన్న రెండు చిన్న కుక్కలు ఎటాక్ ప్రారంభించాయి. ఇరువైపుల నుంచి రెండు కుక్కలు, రెండు సింహాలు దెబ్బ దెబ్బగా దాడి చేసుకునే ప్రయత్నం చేశాయి. కానీ గేట్లు అడ్డురావడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఒక సింహాం వెనక్కి వెళ్లినట్లే వెళ్లి తిరిగి వచ్చి ఎటాక్ చేసే ప్రయత్నం చేసింది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే గేటు కొంచెం తెరిచి ఉండడంతో ఒక కుక్క బయటకు వచ్చి చూసింది. కానీ సింహాలు కనిపించకపోవడంతో తిరిగి లోపలికి వచ్చేసింది. ఇంతలో వాచ్‌మన్ వచ్చి టార్చ్‌లైట్‌తో చూశాడు. ఏమీ కనిపించలేదు. దీంతో గేట్లు లాక్ చేసేశాడు. అనంతరం ఇంకో గేటు నుంచి బయటకు వెళ్లి చూసే ప్రయత్నం చేశాడు. కానీ ఎలాంటి చప్పుడు కనిపించలేదు. దీంతో అతడు లోపలికి వచ్చేశాడు. ఇక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ తతాంగం అంతా రికార్డ్ అయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: AP Super Speciality Hospitals: ప్రభుత్వానికి ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నోటీసు
సింహాలు గిర్ నేషనల్ పార్క్ నుంచి ఎలా తప్పించుకుని వచ్చాయో అర్ధం కావడం లేదు. అయితే రెండు సింహాలు బక్కచిక్కిపోయి ఉన్నాయి. ఆకలితో ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుక్కలతో ఫైటింగ్‌కు దిగినట్లు కనిపిస్తోంది. కొద్దిసేపు ఫైట్ చేసి సింహాలు సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయాయి. వాచ్‌మన్‌కు మాత్రం అక్కడేం జరిగిందో మాత్రం తెలియలేదు. అయితే సింహాలు దారి తప్పడంపై అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. 2020 లెక్కల ప్రకారం గుజరాత్‌లో 674 ఆసియాటిక్ సింహాలు ఉన్నట్లు సమాచారం.
Amreli: Lions Clash with Dogs in a Viral Video pic.twitter.com/ihoiLx7u60
— Republic (@republic) August 14, 2024