సౌత్‌లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ కోలీవుడ్. చెప్పాలంటే ఇతర చిత్ర పరిశ్రమలు డెవలప్ కాకముందే దక్షిణాదిని రూల్ చేసింది. బాలీవుడ్ సైతం సౌత్ అంటే కేవలం తమిళ చిత్ర పరిశ్రమే అనేట్లుగా మాట్లాడేది. కానీ పరిస్థితులు మారాయి. నార్త్ బెల్ట్‌నే కాదు టోటల్ ఇండియన్ బాక్సాఫీసును రూల్ చేస్తోంది టాలీవుడ్. బాహుబలి తర్వాత టీటౌన్ రేంజ్ మారిపోయింది. మంచి స్క్రిప్ట్, భారీ బడ్జెట్ చిత్రాలు, ప్రయోగాలు భారీ కాస్టింగ్, ఉన్నతమైన మౌలిక సదుపాయాలు, హాలీవుడ్ తరహాలో వీఎఫ్ఎక్స్‌లు వెరసి తెలుగు చిత్ర పరిశ్రమను టాప్‌లో కూర్చొబెట్టాయి.
Also Read : Triptii Dimri : బాలీవుడ్ బ్యూటీ సొగసులు.. హొయలు.. భళారే
బాలీవుడ్ స్థాయిని దాటేసింది టాలీవుడ్. తెలుగు సినిమాను చూసి కన్నడ పరిశ్రమ ప్రయోగాలు చేసి సక్సెస్ అయింది. కేజీఎఫ్, కాంతార తర్వాత కన్నడ చిత్ర పరిశ్రమ సినారియోను మార్చేశాయి. వెయ్యికోట్ల మార్క్ టచ్ చేసిన శాండిల్ వుడ్ ఇప్పుడు బడా బడ్జెట్ చిత్రాలను అందిస్తోంది. ఇప్పుడిప్పుడే మలయాళ చిత్ర పరిశ్రమ కూడా రిస్కుకు రెడీ అవుతోంది. కానీ వందేళ్ళ ఘన చరిత్ర కలిగిన తమిళ ఇండస్ట్రీకి రూ. 1000 కోట్ల కలెక్ట్ చేసిన సినిమా లేదు. స్టార్ హీరోలు సైతం ఈ మార్క్ అందుకోలేక పోతున్నారు. అంతెందుకు రూ. 500 కోట్లను రాబట్టుకోవడంలో కూడా చతికలబడుతోంది కోలీవుడ్. ఎన్నో అంచనాలతో వచ్చిన కంగువా, తంగలాన్, ఇండియన్ 2, వెట్టయాన్ ఇవన్నీ కూడా రూ. 150 నుండి రూ. 500 కోట్ల బడ్జెట్ చిత్రాలే. కానీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సినిమా తీయడంలోనే కాదు మార్కెట్ చేసుకోవడంలో టెక్నిక్ తెలిసి ఉండాలి. భారీ బడ్జెట్ తీశామని ఇచ్చుకుంటున్న బిల్డప్‌లో స్టోరీని ప్రజెంట్ చేయడంలో, పిక్చర్ మార్కెట్ చేసుకోవడంలో, ప్రమోషన్లపై కాన్సంట్రేషన్ పెట్టి ఉంటే బిజినెస్ ఆ స్థాయిలోనే జరుగుతుందన్నది క్రిటిక్స్ వాదన.