Mega 157: కొత్త కథలు.. కొత్త కథలు.. కొత్త కథలు ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం కొత్త కథలు కావాలనే తిరుగుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి కొత్త కథలు.. ఎంత కొత్తగా ఆలోచించినా.. ఏదో ఒక సినిమా.. అలాంటి కథనే బేస్ చేసుకొని ఉంటుంది. అందుకే చాలామంది దర్శకులు.. పాత కథలను తిమ్మినిబమ్మిని చేసి కొత్త కథగా తీర్చిదిద్దేస్తున్నారు. లేకపోతే సేఫ్ గా రీమిక్స్ అని చెప్పేస్తున్నారు. ఇంకొంతమంది అయితే.. హిట్ అయిన సినిమాకు సీక్వెల్ అని.. ప్రీక్వెల్ అని చెప్పుకొస్తున్నారు. ఏది ఏమైనా ఒక కథను కొత్తగా చుపిస్తున్నామని పాత సినిమాలనే రీక్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు హిట్ అందుకున్నా సినిమాలకు సంబంధించిన ఒక లైన్ తీసుకొని.. తమకు నచ్చిన విధంగా మార్చుకొని హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఎంతోమంది.. ఇక ఇవన్నీ ఇప్పుడెందుకు వచ్చాయి అంటే.. బింబిసార సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ వశిష్ఠ. మొదటి సినిమా పీరియాడిక్ డ్రామా తెరకెక్కించడమే గొప్ప అనుకుంటే.. హిట్ అందుకొని మెగాస్టార్ కంట్లో పడడం మరింత గొప్ప అని చెప్పాలి.
Nassar: బాహుబలి బిజ్జాల దేవా ఇంట తీవ్ర విషాదం
ఇక రెండో సినిమానే మెగాస్టార్ చిరంజీవితో మెగా 157 ను మొదలుపెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. పంచభూతాలను కలిపిన కథతో వశిష్ఠ రానున్నాడని తెలుస్తోంది. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కుర్ర డైరెక్టర్ జగదేక వీరుడు అతిలోక సుందరి కథ ఆధారంగా కొన్ని సీన్స్ రాసుకున్నాడని సమాచారం. అంతేకాకుండా అందులోని కొన్ని సీన్స్ ను రీ క్రియేట్ చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడని తెలుస్తోంది. దీంతో జగదేక వీరుడు అతిలోక సుందరి నిర్మాతలు ముందుగానే వార్నింగ్ ఇచ్చారని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి కు సీక్వెల్ కానీ, ప్రీక్వెల్ కానీ, సీన్స్ రీ క్రియేట్ చేయడం కానీ, కనీసం ఆ కథ ఆధారంగా మరో కథను రాసుకోవడానికి కూడా వీల్లేదని, అలా చేస్తే లీగల్ చర్యలు తప్పవు అని చెప్పుకొచ్చారు. అయితే వైజయంతీ మూవీస్ ఇచ్చిన వార్నింగ్ మెగా 157 కే అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజమున్నది అనేది తెలియాల్సి ఉంది.