Tripti Dimri Gives Clarity On Dating Rumours With Karnesh Sharma: సినీ పరిశ్రమలో డేటింగ్స్ అనేవి సర్వసాధారణం. తమకు ఒక వ్యక్తి నచ్చితే చాలు.. వాళ్లతో ఇక డేటింగ్ మొదలుపెడతారు. కాకపోతే.. అఫీషియల్‌గా అనౌన్స్ చేయడానికి చాలామంది ఇష్టపడరు. అది తమ వ్యక్తిగత వ్యవహారమని, దానిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ.. కొందరు నటీనటులు మొహం తిప్పేస్తుంటారు. కానీ.. బాలీవుడ్ నటి తృప్తి డిమ్రీ మాత్రం అలా కాదు. అందరికి భిన్నంగా.. తన డేటింగ్ మిస్టరీపై క్లారిటీ ఇచ్చింది. తాను నటి అనుష్క శర్మ సోదరుడు, నిర్మాత కర్ణేష్ శర్మతో ప్రేమలో ఉన్నానని అధికారికంగా ప్రకటించింది. న్యూ ఇయర్ సందర్భంగా ఈ విషయాన్ని రివీల్ చేసింది. తన ఇన్‌స్టా స్టోరీలో కర్ణేష్‌తో కలిసున్న ఫోటోను షేర్ చేస్తూ.. మై లవ్ అంటూ ఎమోజీలు జత చేసింది.
Liquor Sales: తగ్గేదే లే.. తెలంగాణని టాప్ లో నిలిపిన మందుబాబులు
కర్ణేష్ తన బ్యానర్‌లో 2020లో నిర్మించిన బుల్‌బుల్ సినిమాలో తృప్తి నటించింది. ఆ సినిమా ద్వారా కలిసిన ఈ జంట.. అప్పట్నుంచే ప్రేమలో మునిగితేలుతున్నారు. వీళ్లు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు కూడా గట్టిగానే చక్కర్లు కొట్టాయి. కానీ.. ఏనాడూ వీళ్లు తమ రిలేషన్‌షిప్ గురించి ఓపెన్ అవ్వలేదు. అయితే.. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాత్రం తాను కర్ణేష్‌తో ప్రేమలో ఉన్నానని విషయాన్ని రివీల్ చేసింది. తమ ప్రయాణం ఇప్పుడై మొదలైందని, ఇంతకుమించి తన రిలేషన్‌షిప్ గురించి చెప్పలేనని తెలిపింది. తన పెళ్లికి ఇంకా 7-8 సంవత్సరాల సమయం ఉందని పేర్కొంది. ఇప్పుడు ఇన్‌స్టా స్టోరీలో భాగంగా.. ప్రేమ గురించి ఓపెన్ అవ్వడాన్ని బట్టి చూస్తుంటే, ఈ జంట తమ ప్రేమను మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. చూద్దాం.. వీరి ప్రేమాయణం పెళ్లిదాకా వెళ్తుందో లేదో?
Liquor Sales: తగ్గేదే లే.. తెలంగాణని టాప్ లో నిలిపిన మందుబాబులు