Minister KTR Started Kothaguda Flyover: నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకొని.. హైదరాబాద్ కొత్తగూడలో నిర్మించిన ఫ్లైఓవర్‌ను, అలాగే అండర్‌పాస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలుత అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గతేడాది తొలిరోజు షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ని ప్రారంభించుకున్నామని.. ఇప్పుడు ఈ కొత్తగూడ ఫ్లైఓవర్‌ను ఈ ఏడాది తొలిరోజు ప్రారంభించామని అన్నారు. ఎస్ఆర్‌డీపీ కింద ఇది 34వ నిర్మాణమని తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఏ నగరంలో జరగని మౌలిక వసతుల కల్పన హైదరాబాద్‌లో జరుగుతోందని, నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. కేసీఆర్ విజన్‌కి, ఆయన సూచనలకు అనుగుణంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
China Covid: చైనాలో కరోనా విలయ తాండవం.. రోజుకి 9 వేల మరణాలు
తనకు హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి సోషల్ మీడియాలో మెసేజెస్ వస్తాయని.. అభివృద్ధి, సంక్షేమంపై పని చేస్తున్నామని కేటీఆర్ పేర్కొన్నారు. చేసేది ఇంకా ఉందని, కానీ చేసింది కూడా గుర్తించుకోవాలని చెప్పారు. రాబోయే 50 సంవత్సరాలకు సరిపడా నీటి కోసం కార్యక్రమాలు చేపట్టామన్నారు. గత వరదల్ని దృష్టిలో ఉంచుకొని.. స్ట్రాటజిక్ నాలా కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. వెయ్యి కోట్ల రూపాయలతో నాలా డెవలప్‌మెంట్ పనులు చేస్తున్నామని.. మార్చి లేదా ఏప్రిల్ నాటికి ఈ నాలా కార్యక్రమం పూర్తవుతుందని తెలిపారు. 100% సీవరేజ్ ట్రీట్మెంట్ కోసం 31 ఎస్టీపీలు కడుతున్నామని.. దీంతో దేశంలోనే తొలి 100% సీవరేజ్ ట్రీట్మెంట్ సిటీగా హైదరాబాద్ అవతరించనుందని అన్నారు. ఎస్ఆర్‌డీపీ కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో దాదాపు 20 పూర్తి చేశామని.. మరో 11 ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
Gas Cylinder Price: న్యూ ఇయర్ వేళ బాంబ్ పేల్చిన కేంద్రం.. గ్యాస్ సిలిండర్ ధర పెంపు
తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ నగరం కల్పతరువు వంటిందని.. అందరికీ ఉపాధి అందిస్తుండటంతో ఎక్కువ అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రాబోయే మూడేళ్ళలో 3500 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నామన్నారు. దేశంలో ఏ నగరంలో లేనంత అభివృద్ధి హైదరాబాద్‌లో జరుగుతుందన్నారు. ఏకకాలంలో అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.