South Heros : ఇప్పుడు అంతా ఇన్ స్టా గ్రామ్ హవానే నడుస్తోంది. సెలబ్రిటీలకు అత్యధిక ఫాలోవర్లు కూడా ఇన్ స్టాలోనే ఉంటున్నారు. మరి సౌత్ లో ఏ హీరో టాప్.. ఏ స్టార్ హీరోకు ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. సౌత్ లో చూసుకుంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నాడు. ఈయనకు ఏకంగా 28 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పుష్ప తర్వాత క్రేజ్ భారీగా పెరగడంతో ఫాలోవర్లు ఎక్కువగా పెరిగారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈయనకు 25.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మూడో స్థానంలో 21.9 మిలియన్ ఫాలోవర్లతో విజయ్ దేవరకొండ ఉన్నాడు.
Read Also : Ariyana : తొమ్మిదో క్లాస్ లోనే అతన్ని లవ్ చేశా.. అరియానా బ్రేకప్ స్టోరీ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు 13.1మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మహేశ్ బాబుకు 14.6 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. పవన్ కల్యాణ్ కు 3.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కు 8.1 మిలియన్ ఫాలోవర్లు, నానికి 8.4 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. అటు తమిళంలో చూసుకుంటే దళపతి విజయ్ కు 13.1 మిలియన్ ఫాలోవర్లు, రజినీకాంత్ కు 1.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. సూర్యను ఇన్ స్టాలో 9.8మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ధనుష్ కు 8.1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. కన్నడ స్టార్ హీరో యష్ కు 13.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. మన టాలీవుడ్ హీరోలే అందరికంటే టాప్ లో ఉండటం విశేషం. అందులోనూ ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ కు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పుడు పాన్ ఇండియా యుగం నడుస్తోంది కాబట్టి మన హీరోల ఫాలోవర్లు ఈ రెండేళ్లలోనే గణనీయంగా పెరిగారు.
Read Also : Vijay Devarakonda : విజయ్ కోసం రూ.2 కోట్ల సెట్..?
