Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ఇప్పటికే కంగ్ డమ్ మూవీని కంప్లీట్ చేశాడు. ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ టైమ్ లోనే మరో మూవీని లైన్ లో పెట్టేశాడు విజయ్. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మిస్తున్నారు. 1854 నుంచి 1878 కాలంలో జరిగిన యదార్థ సంఘటలన ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీని జులై రెండో వారం నుంచే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. దీని కోసం హైదరాబాద్ శివారు ప్రాంతంలో రూ.2 కోట్లతో భారీ సెట్ వేశారంట.
Read Also : Diogo Jota: విషాదం.. కారు ప్రమాదంలో ఫుట్‌బాల్ క్రీడాకారుడు దుర్మరణం
ఆ సెట్ లోనే కీలక సీన్లు తీస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ సెట్ పూర్తిగా అప్పటి కాలానికి అనుగుణంగా వేస్తున్నారంట. ఇప్పటి వరకు ఇలాంటి సెట్ ను ఎవరూ వేయలేదనే ప్రచారం జరుగుతోంది. ఇందులో విజయ్ ఒక యోధుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తోందంట. త్వరలోనే అఫీషియల్ ప్రకటన రాబోతోంది. భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ కోర మీసాలతో కట్టిపడేస్తున్నాడు. ఆ లుక్ రాహుల్ సాంకృత్యన్ సినిమా కోసమే అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం అన్ని భాషల నుంచి నటులను తీసుకుంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తారనే ప్రచారం జరుగుతోంది. విజయ్ త్వరలోనే కింగ్ డమ్ ప్రమోషన్లలో పాల్గొనాల్సి ఉంది. మరి రెండింటినీ మేనేజ్ చేస్తారా లేదంటే షూటింగ్ వైపే ఉంటాడా వెయిట్ చేయాల్సిందే.
Read Also : Cine Roundup : టాలీవుడ్.. బాలీవుడ్.. కోలీవుడ్.. సినిమాల రౌండప్