వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచకుడు.. విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన తెలుగు టీచర్ కొందరి ఉపాధ్యాయుల తీరు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు బోధించి సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్స్ తప్పటడుగులు వేస్తున్నారు. తమ ప్రవర్తనతో, చేష్టలతో అపకీర్తి మూటగట్టుకుంటున్నారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచార యత్నాలకు పాల్పడడం వంటివి చేస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా ములుగు (మం) లక్ష్మక్కపల్లి గ్రామంలోని వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచక టీచర్ బాగోతం…