Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన సంఘటనలు.. కొన్ని రూమర్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ చిత్రంతో రేణు దేశాయ్ నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సింగిల్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఈ సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేసారు. వీడు అంటూ సాగిన ఈ సాంగ్ ప్రోమో వేరే లెవెల్లో ఉంది. ముఖ్యంగా జీవి ప్రకాష్ సంగీతం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సాంగ్స్ ను బట్టే తెలుస్తోంది.
Manchu Vishnu: కన్నప్ప నుంచి ఆమె అవుట్.. బాధగా ఉందన్న మంచు విష్ణు
“అందరు ఆగిపోయిన చోట.. మొదలవుతాడు వీడు. అందరిని భయపెట్టే చీకటినే భయపెడతాడు వీడు. అవసరం అనుకుంటే తన నీడను వదిలేస్తాడు వీడు.. సచ్చిపోయేటప్పుడు ఏదో తీసుకుపోయేవాడు వీడు” అంటూ హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ.. చంద్రబోస్, ఉమాదేవి రాసిన లిరిక్స్ కు అనురాగ్ కులకర్ణి తన గాత్రంతో ప్రాణం పోశాడు. ఇక వీడియోలో రవితేజ లుక్ ఏదైతే ఉందో.. థియేటర్ లో అభిమానులకు పూనకాలే అని చెప్పాలి. ఆ మాస్ కటౌట్.. క్యారెక్టర్ లో ఆ పొగరు .. అదరగొట్టేశాడు. ఇక ఫుల్ సాంగ్ ను సెప్టెంబర్ 21 న రిలీజ్ చేయనున్నారు. సాంగ్స్ తో అంచనాలు పెంచేస్తున్న ఈ సినిమాతో రవితేజ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.