‘వారసుడు సినిమాని జనవరి 14కి వాయిదా వేస్తూ దిల్ రాజు తప్పు చేసాడేమో అనే మాట ఈరోజు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం వారిసు సినిమా తమిళనాట విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకోవడమే. విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు. భారి అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి న్యూట్రల్ ఆడియన్స్ నుంచి యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ రివ్యూస్ వస్తున్నాయి కానీ క్రిటిక్స్ అండ్ విజయ్ డై హార్డ్ ఫాన్స్ నుంచి మాత్రం వారిసు సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తోంది. విజయ్ స్టైల్, స్వాగ్, కామెడీ టైమింగ్, ఎమోషనల్ సీన్స్ లో అతను చేసిన పెర్ఫార్మెన్స్, డాన్స్ ఇలా ప్రతి విషయంలో వారిసు సినిమాకి మంచి మార్కులు పడుతున్నాయి. తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి కోలీవుడ్ సినీ అభిమానులు ఫిదా అవుతున్నారు. శరత్ కుమార్, విజయ్ మధ్య సీన్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రష్మిక ప్రత్యేకించి చెయ్యడానికి ఏమీ లేకపోయినా డాన్స్ విషయంలో కాంప్లిమెంట్స్ అందుకుంటుంది.
వారిసు సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో పాజిటివ్ గానే ట్వీట్ చేస్తున్నారు. ఇంత పాజిటివ్ రెస్పాన్స్ ని రాబడుతున్న వారిసు సినిమా తెలుగులో కూడా రిలీజ్ అయ్యి ఉంటే ఇక్కడ కూడా హిట్ టాక్ సొంతం చేసుకునేది, మంచి ఓపెనింగ్స్ వచ్చేవి. దిల్ రాజు మంచి ఛాన్స్ ని మిస్ చేసుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొన్నటి వరకేమో దిల్ రాజు తెలుగు సినిమాలకి పోటీగా డబ్బింగ్ సినిమాని ఎలా విడుదల చేస్తాడు అంటూ గోల చేశారు, ఇప్పుడు ఏమో దిల్ రాజు ఆ సినిమాని విడుదల చేసి ఉంటే బాగుండేదేమో అంటున్నారు. ఏంటో ఈ మనుషుల అభిప్రాయాలు అనుకోని వదిలెయ్యడమే దిల్ రాజుకి కరెక్ట్ గా సెట్ అయ్యే ఆప్షన్.