‘వారసుడు సినిమాని జనవరి 14కి వాయిదా వేస్తూ దిల్ రాజు తప్పు చేసాడేమో అనే మాట ఈరోజు సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం వారిసు సినిమా తమిళనాట విడుదలై మంచి టాక్ ని సొంతం చేసుకోవడమే. విజయ్ హీరోగా నటించిన వారిసు సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేశాడు. భారి అంచనాల మధ్య ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి న్యూట్రల్ ఆడియన్స్ నుంచి యావరేజ్ నుంచి అబోవ్ యావరేజ్ రివ్యూస్ వస్తున్నాయి…
దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాని జనవరి 11న రిలీజ్ చెయ్యట్లేదు, దిల్ రాజు తెలుగు వర్షన్ ని డిలేతో ప్రేక్షకుల ముందుకి తెస్తున్నాడు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వార్తని నిజం చేస్తూ ప్రొడ్యూసర్ దిల్ రాజు, వారసుడు సినిమాని జనవరి 14న విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. వారిసు సినిమాని మాత్రం ఇప్పటికే అనౌన్స్ చేసిన జనవరి 11నే రిలీజ్ చేస్తున్నారు కానీ…
2023 సంక్రాంతికి తెలుగు స్ట్రెయిట్ సినిమాల కన్నా తన డబ్బింగ్ సినిమాకే ఎక్కువ థియేటర్స్ ఇస్తున్నాడు అంటూ స్టార్ ప్రొడ్యూసర్ పై ఎప్పటినుంచి విమర్శలు మొదలయ్యాయో అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సీజన్ గురించి డిస్కషన్ మొదలయ్యింది. సినిమా ఎవరిదైనా, డబ్బులు మాత్రం అందరివీ… ఎవరు ఏ సినిమా తీసినా డబ్బులు పెట్టే తీస్తారు, డబ్బుల కోసమే తీస్తారు. బ్రతకడమే కష్టం అయినప్పుడు, ఎలా బ్రతికితే ఏంటి అనే సినిమా డైలాగ్ చెప్పినట్లు. అసలు సినిమా…
దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారసుడు/వారిసు’. ఈ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు దిల్ రాజు. ముందు జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమాకి పోటీగా వారసుడు సినిమా అవుతుందని ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సరేలే కోలీవుడ్ లో కూడా అజిత్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వస్తుంది కదా, ఆ మూవీకి వారసుడుకి మధ్య ఒక్క రోజు అయినా గ్యాప్ ఉందిలే అని అంతా అనుకున్నారు.…